ఉద్యోగులకు షాక్.. జీతాలు చెల్లించాల్సిన అవసరం లేదన్న కేంద్రం..!

లాక్‌డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు కేంద్రం షాకిచ్చింది. వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు తప్పనిసరిగా జీతాలు చెల్లించాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. దీంతో భారీ పరిశ్రమలకు, కంపెనీలకు ఊరట లభించినట్లైంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేమని ఓ పరిశ్రమ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 15న విచారించిన సుప్రీంకోర్టు.. జీతాలు చెల్లించలేని సంస్థలపై వారం […]

ఉద్యోగులకు షాక్.. జీతాలు చెల్లించాల్సిన అవసరం లేదన్న కేంద్రం..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 5:41 PM

లాక్‌డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు కేంద్రం షాకిచ్చింది. వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు తప్పనిసరిగా జీతాలు చెల్లించాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. దీంతో భారీ పరిశ్రమలకు, కంపెనీలకు ఊరట లభించినట్లైంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేమని ఓ పరిశ్రమ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 15న విచారించిన సుప్రీంకోర్టు.. జీతాలు చెల్లించలేని సంస్థలపై వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రానికి సూచించింది. ఎక్కువ ఆదాయాన్ని పొందని చిన్న కంపెనీలు, లాక్‌డౌన్‌ సమయంలో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమవుతుందని సుప్రీం వెల్లడించింది. ఈ ఆర్డర్‌పై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని, వాటన్నింటికి సమాధానం వెతకాలని కేంద్రానికి సూచించింది. అంతేకాదు చిన్న కంపెనీలకు ప్రభుత్వ సహకారం లేకపోతే.. వారి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేవని తెలిపింది.

Read This Story Also: రావాల్సింది వెయ్యి మంది.. వచ్చింది మాత్రం వేలాదిమంది..!