చెత్త రహిత నగరాల జాబితా.. ఏపీలోని ఆ నగరాలకు 3 స్టార్ రేటింగ్..!
దేశవ్యాప్తంగా చెత్త రహిత నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వ్యర్థాల నిర్వహణ విషయంలో భాగంగా పలు నగరాలకు రేటింగ్‌ను ఇచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నగరాలకు 5, ఆ తర్వాత స్థానాల్లో నగరాలకు 3, 1 స్టార్ రేటింగ్‌ని ఇచ్చింది. 10 లక్షల జియో ట్యాగింగ్ ఫొటోలు, ప్రజల ఫీడ్ బ్యాక్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పనితీరు ఆధారంగా ఈ రేటింగ్‌ను ఇచ్చారు. రేటింగ్ కోసం 1435 నగరాలు దరఖాస్తు చేసుకోగా.. 1210 మంది […]

దేశవ్యాప్తంగా చెత్త రహిత నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వ్యర్థాల నిర్వహణ విషయంలో భాగంగా పలు నగరాలకు రేటింగ్‌ను ఇచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నగరాలకు 5, ఆ తర్వాత స్థానాల్లో నగరాలకు 3, 1 స్టార్ రేటింగ్‌ని ఇచ్చింది. 10 లక్షల జియో ట్యాగింగ్ ఫొటోలు, ప్రజల ఫీడ్ బ్యాక్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పనితీరు ఆధారంగా ఈ రేటింగ్‌ను ఇచ్చారు. రేటింగ్ కోసం 1435 నగరాలు దరఖాస్తు చేసుకోగా.. 1210 మంది క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ నివేదికను సమర్పించారు.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 6 నగరాలు 5 స్టార్ రేటింగ్‌ని చేజిక్కించుకున్నాయి. అందులో అంబికాపూర్, రాజ్‌కోట్, సూరత్, మైసూర్, ఇండోర్, నవీ ముంబైలు ఉన్నాయి. ఇక 3-స్టార్ రేటింగ్‌లో ఏపీ నుంచి తిరుపతి, విజయవాడ ఉండగా 1-స్టార్ రేటింగ్‌లో చీరాల, విశాఖ, పలమనేరు, సత్తెనపల్లి ఉన్నాయి. మొత్తం 65 నగరాలు 3 స్టార్ రేటింగ్, 70 నగరాలు 1 స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి 3 స్టార్ రేటింగ్ వచ్చింది.
Read This Story Also: ఉద్యోగులకు షాక్.. జీతాలు చెల్లించాల్సిన అవసరం లేదన్న కేంద్రం..!



