“మేమూ”.. శ్రీరాముడి వంశానికి చెందిన వారసులమే..
శ్రీరాముడి కుమారుడైన కుళుడి వంశానికి చెందినవారమంటూ జైపూర్ రాజవంశానికి చెందిన దియాకుమారి చెప్పిన మరుసరటి రోజే.. తాము రాముడి వంశానికి చెందినవారమంటూ మరో రాజకుటుంబానికి చెందిన అతడు మీడియా ముందుకొచ్చాడు. మేవర్-ఉదయ్ పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ కూడా తాము రాముడి కుటుంబానికి చెందినవారమంటూ ప్రకటించారు. శ్రీరాముని వంశానికి చెందిన వారసులెవరైనా ఉన్నారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం మీడియా ద్వారా తెలిసిందంటూ.. తాము రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారమని అతడు చెప్పాడు. లవుడి […]
శ్రీరాముడి కుమారుడైన కుళుడి వంశానికి చెందినవారమంటూ జైపూర్ రాజవంశానికి చెందిన దియాకుమారి చెప్పిన మరుసరటి రోజే.. తాము రాముడి వంశానికి చెందినవారమంటూ మరో రాజకుటుంబానికి చెందిన అతడు మీడియా ముందుకొచ్చాడు. మేవర్-ఉదయ్ పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ కూడా తాము రాముడి కుటుంబానికి చెందినవారమంటూ ప్రకటించారు. శ్రీరాముని వంశానికి చెందిన వారసులెవరైనా ఉన్నారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం మీడియా ద్వారా తెలిసిందంటూ.. తాము రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారమని అతడు చెప్పాడు. లవుడి పూర్వీకులు తొలుత గుజరాత్‌లో ఉండేవారని ఆ తర్వాత అక్కడి నుంచి అహద్‌కు వచ్చారని తెలిపాడు. అక్కడ శిసోడియా వంశాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నాడు. తొలుత వారి రాజధాని చిత్తోర్ అని తర్వాత దానిని ఉదయ్ పూర్‌కు మార్చారని తెలిపాడు. అవసరమైతే అందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తామని మహేంద్రసింగ్ చెప్పాడు.