500 ఏళ్ల నాటి ఆలయ కూల్చివేత.. పంజాబ్‌లో ప్రకంపనలు

ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చివేతకు నిరసనగా మంగళవారం పంజాబ్ బంద్‌కు రవిదాసియా వర్గం పిలుపునిచ్చింది. బంద్ పిలుపుతో జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అయితే సమస్యను పరిష్కరించేందుకు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో చర్చలు జరిపామని.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్‌ సింగ్‌ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయన చొరవచూపుతామని హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు. ఈ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త […]

500 ఏళ్ల నాటి ఆలయ కూల్చివేత.. పంజాబ్‌లో ప్రకంపనలు

ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చివేతకు నిరసనగా మంగళవారం పంజాబ్ బంద్‌కు రవిదాసియా వర్గం పిలుపునిచ్చింది. బంద్ పిలుపుతో జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అయితే సమస్యను పరిష్కరించేందుకు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో చర్చలు జరిపామని.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్‌ సింగ్‌ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయన చొరవచూపుతామని హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు. ఈ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పై ఆయన ఢిల్లీలోని సీనియర్‌ నేతలతో చర్చలు జరిపారు. ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అకాలీదళ్‌ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది రవిదాస్‌ వర్గ మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్‌ షాను కలిసి ఈ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్‌ స్పష్టం చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu