MEIL: మరో ఘనత సాధించిన మేఘా ఇంజనీరింగ్.. కాశ్మీర్ లో అత్యంత క్లిష్టమైన ఆల్ వెదర్ జోజిలా టన్నెల్‌లో ట్యూబ్ నిర్మాణం పూర్తి
మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో ఘనత సాధించింది. జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ఆల్-వెదర్ జోజిలా టన్నెల్ నిర్మాణంలో ఎంఈఐఎల్ బృందం పురోగతి సాధించింది.
MEIL: మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో ఘనత సాధించింది. జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ఆల్-వెదర్ జోజిలా టన్నెల్ నిర్మాణంలో ఎంఈఐఎల్ బృందం పురోగతి సాధించింది. క్లిష్ట పరిస్థితిలో.. నీరు ఇంకిపోతున్న పరిస్థితిలో కష్టతరంగా ఉన్నప్పటికీ షెడ్యూల్ కంటే ముందే ఛాలెంజింగ్ షెడ్యూల్ పూర్తి చేసి బృందం సంచలనం సృష్టించింది. ఈ టన్నెల్ 1 లో 472 మీటర్ల ట్యూబ్ తవ్వకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
భారతదేశంలోని ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన MEIL, అక్టోబర్ 01, 2020న EPC మోడ్‌లో కాశ్మీర్ లోయను లడఖ్‌కు అనుసంధానించే ఆల్-వెదర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ (జోజిలా ప్రాజెక్ట్)ను అందుకుంది. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 32 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా విభజించారు.
ప్రాజెక్ట్ మొదటి భాగం 18 కిమీ సోనామార్గ్.. తాల్తాల్‌లను కలుపుతుంది. దీనిలో ప్రధాన వంతెనలు, జంట సొరంగాలు ఉన్నాయి. టన్నెల్ T1, రెండు ట్యూబ్‌లను కలిగి ఉన్న నిర్మాణం. ఇందులో ట్యూబ్ 1 (TUBE 1 P2 P4) పొడవు 472 మీటర్లు.. అలాగే, ట్యూబ్ 2(TUBE 1 P1 P3) 448 మీటర్లు. ట్యూబ్1 నవంబర్ 4న దీపావళి శుభ సందర్భంగా పూర్తయింది. అదేవిధంగా 2వ ట్యూబ్ సోమవారం(22 నవంబర్) మధ్యాహ్నం నిర్మాణం పూర్తి చేసుకుంది.
యాక్సెస్ రోడ్ల నిర్మాణం తర్వాత, మే 2021 నెలలో MEIL ప్రాజెక్ట్ పనిని ప్రారంభించింది. హిమాలయాల గుండా టన్నెలింగ్ చేయడం ఎప్పుడూ చాలా కష్టమైన పని. కానీ, MEIL చక్కని ప్రణాళికతో సమయ షెడ్యూల్ సిద్దం చేసుకుంది. భద్రతా, నాణ్యతలతో పాటు వేగంగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ రెండు సొరంగాల తవ్వకం దిగ్విజయంగా పూర్తి చేసింది.
దీని తరువాత 2 కిలోమీటర్ల పొడవుండే జంట ట్యూబ్ ల నిర్మాణ పనుల్లో ఎంఈఐఎల్ బృందం నిమగ్నమైంది. ఈ పనులను ఏప్రిల్ 2022 కల్లా పూర్తి చేయాలనేది లక్ష్యం. ఈపనులు ఇప్పటికే వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇక 13.3 కి.మీ పొడవున్న జోజిలా మెయిన్ టన్నెల్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. MEIL లడఖ్ నుండి 600 మీటర్లు, కాశ్మీర్ వైపు నుండి 300 మీటర్ల పనులను ముందుగానే సాధించింది.
ఇవి కూడా చదవండి: Stock Market: మళ్ళీ పడిపోయిన రిలయన్స్ షేర్ల ధరలు .. భారీగా తగ్గిన మార్కెట్ కాప్.. బజాజ్ గ్రూప్ షేర్లు కూడా.. ఎంతంటే..