రైతు కుటుంబం నుంచి వచ్చా.. వారి సంక్షేమం కోసం పనిచేస్తా: సివిల్స్ టాపర్‌

ఇవాళ విడుదలైన సివిల్స్ సర్వీస్‌ పరీక్ష(2019) ఫలితాల్లో హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్‌ మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.

రైతు కుటుంబం నుంచి వచ్చా.. వారి సంక్షేమం కోసం పనిచేస్తా: సివిల్స్ టాపర్‌

 UPSC topper Pradeep Singh: ఇవాళ విడుదలైన సివిల్స్ సర్వీస్‌ పరీక్ష(2019) ఫలితాల్లో హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్‌ మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. గతేడాది కూడా సివిల్స్‌ని క్లియర్ చేసిన ప్రదీప్‌.. ప్రస్తుతం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నారు. కాగా తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఇకపై వారి సంక్షేమం కోసమే పనిచేస్తానని ప్రదీప్ సింగ్ వెల్లడించారు.

సోన్‌పేట్‌లోని తెవ్రీ గ్రామం ప్రదీప్‌ సొంతూరు కాగా.. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు. ప్రదీప్‌ తండ్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ రైతు మాత్రమే కాదు, ఆ గ్రామానికి రెండు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. తాను ఐఏఎస్ అయ్యేందుకు తన తండ్రి ఎంతగానో ప్రోత్సహించారని ప్రదీప్ వెల్లడించారు. తన డిగ్రీ పూర్తైన వెంటనే ఎస్‌ఎస్‌సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌) కోసం కోచింగ్ తీసుకొని జాబ్‌ను సాధించానని., ఈ క్రమంలో ఐదు సంవత్సరాల పాటు ఢిల్లీలో ఐటీ ఆఫీసర్‌గా పనిచేశానని ప్రదీప్ తెలిపారు. నాలుగు సార్లు యూపీఎస్సీ పరీక్షలను రాయగా.. గతేడాది 206వ ర్యాంక్ వచ్చిందని, ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని వివరించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు చదువుకోవడం చాలా ఇబ్బంది అయ్యిందని, కానీ తాను చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొంతమంది స్నేహితులు కూడా తనను ప్రోత్సహించారని వివరించారు. కాగా ఒకానొక సమయంలో ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవ్వడం మానేద్దాం అనుకున్నానని.. కానీ నమ్మకం కోల్పోవద్దంటూ తన తండ్రి తనలో పాజిటివిటీని నింపారని ప్రదీప్ గుర్తు చేసుకున్నారు.

Read This Story Also: నాని, రామ్‌ క్రిస్మస్‌ వరకు ఆగాల్సిందేనా!

Click on your DTH Provider to Add TV9 Telugu