AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..

రాజస్థాన్‌లో భారీ ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్, శ్రీగంగానగర్ సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకాశమంతా ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే చిమ్మచీకట్లు అలుముకున్నాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా, ప్రజలు ప్రాణభయంతో భవనాల్లో ఆశ్రయం పొందారు. ఇసుక తుఫాన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓర్నాయనో.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
Sandstorm
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2026 | 8:56 AM

Share

రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. ఇసుక తుఫాన్‌ తరువాత చురులో కుంభవృష్టి కురిసింది. ఇదే ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వెంటనే అక్కడ భారీ వర్షం కురిసింది. ఇసుక తుఫాన్‌ కారణంగా రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి. ఇసుక తుఫాను వస్తున్న సమయంలో అక్కడ చిమ్మ చీకట్లు అలముకున్నాయి. చురుతో పాటు పలు ప్రాంతాల్లో ఇసుక తుఫాన్‌తో జనం అవస్థలు పడుతున్నారు. చురులో రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బికనీరులో కూడా ఇసుక తుఫాన్‌ జనాన్ని వణికించింది. శ్రీ గంగానగర్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న ప్రాంతాన్ని ఇసుక తుఫాన్‌ కమ్మేసింది. భారీ ఈదరుగాలుల తరువాత ఇసుక తుఫాన్‌ నివాస ప్రాంతాలను ముంచెత్తింది.

చురు, శ్రీగంగానగర్‌, బికనీర్‌, సీకర్‌ తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవరించడంతో ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దట్టమైన ఇసుక తుపానుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు.. జైపుర్‌లోనూ శుక్రవారం ఇదే విధమైన వాతావరణం కనిపించింది. ఇసుక తుపానుతోపాటు భీకర గాలులు వీచాయి. ధోల్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 5.8సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని జైపుర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జైపుర్‌, అజ్‌మేర్‌, బికనీర్‌, కోటా, జోధ్‌ఫుర్‌, ఉదయ్‌పుర్‌ డివిజన్లలో గంటకు 60-70 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది.

మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగు మారి, భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడటంతో, పట్టపగలే చిమ్మచీకటి అలుముకుంది. అప్పటివరకు ఎండతో అల్లాడిన జనం, ఈ హఠాత్తు పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే.. రోడ్లపై వెళ్తున్న వారు ప్రాణభయంతో సమీపంలోని షాపులు, భవనాల కింద ఆశ్రయం పొందారు. వాహనదారులు మధ్యాహ్నమే హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. బలమైన గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వీడియో చూడండి..

గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌ను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చురులో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోవడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. తీవ్రమైన వేడి గాలుల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి సమయంలో కురిసిన ఈ ఇసుక తుపాను ప్రజలకు ఒక వింత అనుభూతిని, అదే సమయంలో భయాన్ని కలిగించింది. ప్రకృతి సృష్టించిన ఈ బ్లాక్ అవుట్ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.

రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడంతో ఇసుక తుపానులు సహజమే అయినప్పటికీ, ఈ స్థాయిలో పట్టపగలు చీకటి అలుముకోవడం పర్యావరణ మార్పులకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఆస్తి నష్టం , సాధారణ జీవనానికి కలిగిన అంతరాయం ప్రజలను బెంబేలెత్తించింది. ఈ ఇసుక తుపానులకు ప్రధాన కారణం వేడి కాలంలో థార్ ఎడారి భూమి వేడెక్కడమే. లూజుగా ఉండే ఇసుక బలమైన గాలులతో కలిసి ఎగురుతుంది. వర్షాకాలానికి ముందు ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతాయి. IMD ముందుగానే అలర్ట్ జారీ చేసింది. మే 28 నుంచి మే 31 వరకు రాజస్థాన్‌లో డస్ట్ స్టార్మ్స్, గాలులు, వర్షాలు పెరుగుతాయని హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయింది. అదే విధంగా జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us