AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు పోరాటం ఆగదు.. డ్రగ్స్‌పై అమిత్‌షా స్ట్రాంగ్‌ వార్నింగ్

దేశంలో మాదకద్రవ్యాల మూలాలను నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్‌ అంతర్జాతీయ నార్కో-టెర్రరిజం సిండికేట్‌ను బట్టబయలు చేసింది. దాదాపు రూ. 100 కోట్ల హవాలా, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి, 18 మంది కీలక సభ్యులను అరెస్టు చేశారు అధికారులు. ఇందుకు సంబంధించి కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు పోరాటం ఆగదు.. డ్రగ్స్‌పై అమిత్‌షా స్ట్రాంగ్‌ వార్నింగ్
Amit Shah Hails Historic Joint Operation Against Drug Mafia In Northeast
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 11:32 AM

Share

దేశంలో మాదకద్రవ్యాల మూలాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. కేంద్ర ఏజెన్సీలు, అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ట్రైడెంట్ తో అంతర్జాతీయ నార్కో-టెర్రరిజం సిండికేట్ గుట్టు రట్టయింది.ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు.

38 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు

భారత్ – మయన్మార్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో క్రియాశీలంగా ఉన్న డెత్ ట్రయాంగిల్ కారిడార్ ఆధారంగా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌పై ఈ దాడులు జరిగాయి.అస్సాం, మిజోరం, మణిపూర్‌లలోని 38 కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి.డ్రగ్స్ మాఫియా నడుపుతున్న రూ. 100 కోట్ల హవాలా లావాదేవీలను పసిగట్టారు. డ్రగ్స్ ముఠాకు చెందిన ఏకంగా 1,424 బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు.రూ. 17.82 కోట్ల విలువైన ఆస్తుల జప్తు చేశారు..రూ. 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు..దీంతోపాటు 500 డిటొనేటర్లు పేలుడు పదార్థాలు రికవరీ చేసుకున్నారు.. దీంతో పెద్ద నార్కో-టెర్రరిజం కుట్ర భగ్నమైంది.ఈ దాడుల్లో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌కు చెందిన 18 మంది కీలక సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

డ్రగ్స్ నిర్మూలన కోసం మిషన్ 2029

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. డిసెంబర్ 31, 2029 నాటికి దేశంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా మిషన్ 2029 చేపట్టామన్నారు.మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు భారతదేశం తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు..ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన కేంద్ర ఏజెన్సీలతో పాటు అస్సాం, మిజోరం, మణిపూర్ పోలీసు బలగాలను అమిత్ షా అభినందించారు.

పోస్ట్ చూడండి,,

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us