రద్దీగా ఉన్న రోడ్డులో ఇరుక్కుపోయిన పిల్లి.. కాపాడేందుకు వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఊహించని ఘటన!
లారీ డ్రైవర్ స్పందించేలోపుగానే వాహనం సిజోను ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది. లారీ బలంగా ఢీకొనడంతో అమాంతంగా ఎగిరిపడ్డాడు. అంతలోనే ఎదురుగా వస్తున్న కారు అతనిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. సిజోను త్రిస్సూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ రక్షించలేకపోయారు. లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పిల్లిని కాపాడబోయి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడబోయిన అతడు ప్రమాదంలో మరణించాడు. మృతుడు 44ఏళ్ల సీజోగా గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు.. పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, రోడ్డు మధ్యలో ఒక పిల్లి పిల్ల కనబడింది. పాపం ఆ పిల్లి కూనను ఏదైనా వాహనం ఢీ కొడుతుందేమోననే భయంతో.. దానిని కాపాడటానికి పరిగెత్తాడు. కానీ, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతన్ని ఢీకొట్టింది.
వీడియో ఇక్కడ చూడండి..
Tragic End for 42-Year-Old Man Hit by Truck While Saving Cat in Kerala pic.twitter.com/KpLixsdYXX
— Indian News Network (@INNChannelNews) April 9, 2025
లారీ డ్రైవర్ స్పందించేలోపుగానే వాహనం సిజోను ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది. లారీ బలంగా ఢీకొనడంతో అమాంతంగా ఎగిరిపడ్డాడు. అంతలోనే ఎదురుగా వస్తున్న కారు అతనిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. సిజోను త్రిస్సూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ రక్షించలేకపోయారు. లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..