AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వీడేం మనిషి రా బాబు.. ఏకంగా 25 కుక్కలను.. రంగంలోకి పోలీసులు.. వీడియో వైరల్..

రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఒక వ్యక్తి తుపాకీతో 25 కి పైగా కుక్కలను కాల్చి చంపడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Watch: వీడేం మనిషి రా బాబు.. ఏకంగా 25 కుక్కలను.. రంగంలోకి పోలీసులు.. వీడియో వైరల్..
Man Killed 25 Dogs
Krishna S
|

Updated on: Aug 07, 2025 | 5:40 PM

Share

కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. అందుకే చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి మక్కువ చూపిస్తారు. ప్రమాద సమయాల్లో యజమాని కోసం ప్రాణాలను పణంగా పెడతాయి కుక్కలు. అయితే గత కొన్నాళ్లుగా కుక్కల దాడుల్లో చిన్నారులు మరణించడం కలకల రేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పరిస్థతి ఆందోళన కలిగిస్తుంది. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజును జిల్లాలో 25 కి పైగా కుక్కలను కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఓ గ్రామంలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని తిరుగుతూ కనిపించన కుక్కను కాల్చుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జుంజును జిల్లాలోని నవల్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమావాస్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్త భుజానికి తుపాకీ వేసుకుని బైక్‌పై కుక్కలను వెతుక్కంటూ వెళ్లాడు. అలా కనిపించిన కుక్కను కాల్చుకుంటూ పోయాడు. ఇప్పటివరకు 25 కి పైగా కుక్కలను చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు హమిరి గ్రామ మాజీ సర్పంచ్ సరోజ్ తెలిపారు. దుమ్రా నివాసి అయిన షియోచంద్ ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కుక్కల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. కుక్కలను చంపడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాలను చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..