Male Pillion Riders: కొత్త నిబంధనలు.. ఆ జిల్లా అధికారులు సంచలన నిర్ణయం.. బైక్‌పై పురుషుడు వెనుక కూర్చోవద్దు!
Male Pillion Riders: దేశంలో అరచకాలు పెరిగిపోతున్నాయి. ఇక కేరళ రాష్ట్రంలో జరిగిన జంట హత్యలపై పాలక్కాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాలక్కాడ్‌లో జరిగిన..
Male Pillion Riders: దేశంలో అరచకాలు పెరిగిపోతున్నాయి. ఇక కేరళ రాష్ట్రంలో జరిగిన జంట హత్యలపై పాలక్కాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాలక్కాడ్‌లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 20 వరకు ద్విచక్ర వాహనాలపై వెనుక పురుషు రైడర్ కూర్చోవడం నిషేధం విధించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తర్వాత ఈ నిషేధం వచ్చింది. ఈ నాయకులను దారుణంగా హత్య చేశారు. అయితే అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కె మణికందన్ అధికారులు విధించిన ఈ నిషేధం నుండి మహిళలు, పిల్లలను తోసిపుచ్చారు. కేరళ జిల్లా యంత్రాంగం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ఐదుగురు కంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదు. అలాగే ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలను తీసుకెళ్లడం కూడా నిషేధించబడింది.
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా:
సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఆయా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. సున్నితమైన సందేశాలు లేదా చిత్రాలను పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.
పాలక్కాడ్ హత్యలు:
కాగా, ఏప్రిల్ 15న పాలక్కాడ్‌లోని ఒక గ్రామ సమీపంలో PFI నాయకుడు 43 ఏళ్ల సుబైర్‌ను నరికి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం సుబైర్ మసీదులో ప్రార్థనలు చేసి తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతని బైక్‌ను ఢీకొట్టి సుబైర్‌పై ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఘటన స్థలంలో కారును వదిలి పెట్టి పరారయ్యారు హంతకులు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. వదిలి పెట్టిన కారు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సంజిత్ పేరు మీద ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఏప్రిల్ 16న సుబైర్ హత్య జరిగిన ఒకరోజు తర్వాత శ్రీనివాసన్ (45) అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఇతనిపై కొందరు వాహనాలపై వచ్చి దాడి చేసి నరికి చంపారు. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి వెనుక మరో పురుషుడు కూర్చోవడాన్ని నిషేధించిన అధికారులు.. అందుకు కారణాలను వెల్లడించలేదు. ఈ హత్యలలో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి వద్ద ఆయుధాలు కలిగి ఉండటంతో బైక్‌పై పిలియన్ రైడర్‌ను నిషేదించినట్లు పలువురు భావిస్తున్నారు. అలాగే పాలక్కాడ్ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఐదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటం, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ పలు కఠనమైన ఆంక్షలను విధించారు.
ఇవి కూడా చదవండి: