Ananth Ambani-Radhika Merchant: కుమారుడి మాటలకు కన్నీళ్లు పెట్టిన ముఖేష్ అంబానీ.. ప్రీవెడ్డింగ్‌లో ఎమోషనల్ మూమెంట్..
అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గుజరాత్లోని జమ్నా నగర్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు విదేశీ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యాయి. దాదాపు మూడు రోజులపాటు ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ మార్చి 3 వరకు జరగనున్నాయి.

దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త.. రిలియన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇంట్లో పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గుజరాత్లోని జమ్నా నగర్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు విదేశీ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యాయి. దాదాపు మూడు రోజులపాటు ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ మార్చి 3 వరకు జరగనున్నాయి. మొదటి రోజు జమ్నా నగర్ ప్రాంత ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించాడు అంబానీ. ఈ కార్యక్రమంలో దాదాపు 20వేలకు పైగా పాల్గొన్నట్లు సమాచారం. ఇక రెండో రోజు శనివారం ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఈ వేడుకలలో అనంత్ అంబానీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు.. తన ఫ్యామిలీ సపోర్ట్ గురించి భావోద్వేగ స్పీచ్ ఇచ్చాడు. అనంత్ మాట్లాడుతున్న సమయంలో ఆయన తండ్రి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నా జీవితంలో ప్రత్యేకమైన రోజును నాకు సంతోషాన్ని ఇవ్వడానికి నా కుటుంబ మొత్తం కష్టపడింది. నన్ను సంతోషంగా ఉంచేందుకు మా ఎంతో చేశారు. ఆమె రోజుకు 18 – 19 గంటలు కష్టపడ్డారు. ఈ ఈవెంట్ ప్రత్యేకంగా చేసేందుకు గత రెండు మూడు నెలలుగా నా కుటుంబమంతా కేవలం 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు.. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నా బాధను అనుభవించాను. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. జీవితంలో నేను ఏది కావాలనుకుంటే అది చేయగలనని నాకు భరసా ఇచ్చారు. ఆసమయంలో నా తల్లితండ్రుల ప్రేమ నాకు పూర్తిగా అర్థమైంది. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా.. నాతో బలంగా నిలబడిన మా అమ్మ నాన్నలకు ధన్యవాదాలు” అని చెప్పారు. కుమారుడి మాటలు వింటూ ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా సుమారు 1000 కంటే అతిథులు హాజరయ్యారు. బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణే, రణవీర్ సింగ్, రామ్ చరణ్, ఎంఎస్ ధోని, సచిన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పాప్ స్టార్ రిహాన్నా ఈ వేడుకలో మొదటిసారి భారతదేశంలో ప్రదర్శన ఇచ్చింది.
A father can feel the pain of his child in his own flesh and soul.#AnantRadhika #MukeshAmbani pic.twitter.com/I52UGOljOm
— Abhijit Majumder (@abhijitmajumder) March 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
