AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు, ముగ్గురు మృతి!

గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహిసాగర్ నదిపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన భారీ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినగా మరికొందరు నది నీటిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదం కారణంగా చాలా వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని రక్షించారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది.

Watch Video: గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు, ముగ్గురు మృతి!
Bridge Collapse
Anand T
|

Updated on: Jul 09, 2025 | 1:13 PM

Share

గుజరాత్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఆనంద్‌ జిల్లాలోని ఓ భారీ వంతెన కూలిపోయి ముగ్గురు వ్యక్తులు మరణించగా పలువురు నది నీటిలో గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. గుజరాల్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఉన్న మహిసాగర్ నదిపై 40 సంవత్సరాల క్రితం ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు ఆత్మహత్యల నిలయం అనే మరో పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ వంతెనపై నుంచి దూకి ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా ఉన్న వారు దీన్ని అలా పిలుస్తున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ వంతెన నిర్మించి చాలా ఏళ్లు కావడంతో దీనికి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు.

అయితే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేయలేదు. ఇప్పటికే మరమ్మత్తులు అవసరమైన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు మరింత శిథిలావస్థకు చేరుకుంది.ఈ క్రమంలోనే బుధవారం వాహనరాకపోకలు సాగిస్తున్న సమయంలో బ్రిడ్జ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరికొందరు నది నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. కాగా బ్రిడ్జ్‌ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

బ్రిడ్జ్‌ కూలిన ఘటనకు సంబంధించిన వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..