ఆ స్మశానంలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు.. ఒకేసారి 22 కరోనా పేషెంట్స్‌కు చితి.. షాకింగ్ వీడియో.!

Corona Funerals In Ahmednagar: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది...

  • Ravi Kiran
  • Publish Date - 12:33 pm, Fri, 9 April 21
ఆ స్మశానంలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు.. ఒకేసారి 22 కరోనా పేషెంట్స్‌కు చితి.. షాకింగ్ వీడియో.!
Corona Ahmednagar

Corona Funerals In Ahmednagar: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ మరణాల శాతం విపరీతంగా పెరుగుతోంది. స్థానికంగా ఉండే స్మశాన వాటికలన్నీ కూడా కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోతున్నాయని వినికిడి. కొద్దిరోజుల క్రితం బీడ్ జిల్లా అంబజోగైలోని ఒక ఆశ్రయం వద్ద 8 మందికి దహన సంస్కారాలు చేశారని సమాచారం. ఇక అహ్మద్ నగర్‌లో కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. అహ్మద్‌నగర్‌లోని అమర్ ధామ్‌లో ఒకేసారి 22 మందికి(కరోనా పేషెంట్స్) దహన సంస్కారాలు జరిపారట. ఈ హృదయ విచారక వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

అమర్‌ధామ్‌లో ఒకేసారి 22 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారని సమాచారం. అలాగే ఒక రోజులో ఏకంగా 42 మందికి చితి పెట్టారట. కాగా, కరోనా రోగులకు దహన సంస్కారాలు చేయడంలో అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ సవాల్ ఎదుర్కుంటోంది. అహ్మద్‌నగర్ నుంచి ఆరు మృతదేహాలను అమర్‌ధామ్‌ స్మశాన వాటికకు తీసుకుని వెళ్లినట్లు తాజాగా కార్పోరేషన్ దృష్టికి వచ్చింది. అటు అంబజోగై మునిసిపల్ కార్పొరేషన్ ఒకేసారి ఎనిమిది మందికి ఒకే చోట దహన సంస్కారాలు నిర్వహించారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!