ఒక్కరోజులోనే 60 వేల పాజిటివ్‌ కేసులు.. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. దారుణ పరిస్థితులు..

Maharashtra Coronavirus cases : మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ..

ఒక్కరోజులోనే 60 వేల పాజిటివ్‌ కేసులు.. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. దారుణ పరిస్థితులు..
Corona Positive
Follow us
uppula Raju

|

Updated on: Apr 08, 2021 | 5:24 AM

Maharashtra Coronavirus cases : మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 59,907 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 31,73,261 కు చేరుకున్నాయి. నిన్న 322 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 56,652 కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు అత్యధిక మరణాలు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

ఈ రోజు 30,296 మంది రోగులు కోలుకోవడంతో మహారాష్ట్రలో మొత్తం క్రియాశీల COVID-19 కేసులు 5,01,559 కు తగ్గాయి. రాష్ట్ర రికవరీ రేటు ప్రస్తుతం 82.36 శాతంగా ఉంది. ఈ రోజు కొత్త కేసులలో 11,023 కేసులతో పూణే అత్యధికంగా, ముంబై 10,428, నాగ్‌పూర్ 5,721, థానే 3,108, u రంగాబాద్ 1,765 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల రేటు 1.79 శాతంగా ఉంది.

కేసుల పెరుగుదల వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ , వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది.కోవిడ్ వ్యాక్సిన్లు మరిన్ని స్టాక్స్ పంపమని కేంద్రాన్ని కోరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ముంబై నగరంలో టీకా అందుబాటులో లేకపోవడంతో ప్రజలను తిరిగి పంపుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో విధించినటువంటి ఆంక్షలనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 30 వరకూ ఈ కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతోపాటు వారాంతపు లాక్‌డౌన్లు, 144 సెక్షన్ అమల్లోకి తెస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకూ సరైన కారణాలు లేకుండా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కర్ఫ్యూ నిబంధనల నుంచి నిత్యవసర సేవలను మాత్రం మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Thirumala seven hills : పొగమంచుతో మరింత అందాన్నిస్తున్న తిరుమల సప్తగిరులు, పరవశించిపోతోన్న భక్తజనం

ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు.. పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. అసలు ఏమన్నాడో తెలుసా..?