Ambani Brothers : అంబానీ బ్రదర్స్‌కు రూ. 25 కోట్ల జరిమానా..! ఆదేశాలు జారీ చేసిన సెబీ.. ఎందుకో తెలుసా..?
SEBI Slaps rs-25 Crore Fine Ambanis : దేశంలోనే అత్యంత ధనవంతులైన అంబానీ బ్రదర్స్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. రెండు దశాబ్దాలకు పూర్వం
SEBI Slaps rs-25 Crore Fine Ambanis : దేశంలోనే అత్యంత ధనవంతులైన అంబానీ బ్రదర్స్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. రెండు దశాబ్దాలకు పూర్వం జరిగిన ఒక కేసుకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా చెల్లించవచ్చని సెబీ తెలియజేసింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవడం ద్వారా 2005లో ముకేశ్, అనిల్ విడివడిన సంగతి తెలిసిందే.
2000వ సంవత్సరంలో 5 శాతానికిపైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, పీఏసీ.. వివరాలు అందించడంలో విఫలమైనట్లు సెబీ తాజాగా పేర్కొంది. టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించారని సెబీ ఆరోపించింది. అంబానీ బ్రదర్స్‌తోపాటు.. ముకేశ్ భార్య నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ, మరికొన్ని సంస్థలపై జరిమానా విధించింది.
ప్రమోటర్లు, పీఏసీ ఎలాంటి ప్రకటననూ విడుదల చేయలేదని తెలియజేసింది. వారంట్లతో కూడిన రీడీమబుల్ డిబెంచర్ల ద్వారా ఆర్‌ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ.. 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను సొంతం చేసుకున్నాయి. 5 శాతం వాటాకు మించిన ఈ లావాదేవీని టేకోవర్ నిబంధనల ప్రకారం 2000 జనవరి 7న కంపెనీ పబ్లిక్‌గా ప్రకటించవలసి ఉన్నట్లు సెబీ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం భారతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. మరోవైపు ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా మరింత పెరిగింది. గత ఏడాది 102 మంది ఉండగా అది ఈసారి 142కి చేరింది. వీరి సంపద 596బిలియన్ డాలర్లుగా ఉంది. గ్యాస్, టెలికామ్ రంగాల్లో విపరీతమైన వృద్ధి రేటు అందుకున్న ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 84.5బిలియన్ డాలర్లుగా ఉంది.