- Telugu News Photo Gallery Business photos Gautam adani join 100 billion dollar club with mukesh ambani and ratan tata created new history
Gautam Adani: వ్యాపార వర్గాలే ఆశ్చర్యపోయేలా సరికొత్త రికార్డ్ సృష్టించిన గౌతమ్ అదానీ.. 100 బిలియన్ల డార్లతో..
Gautam Adani: వ్యాపర వర్గాలే ఆశ్చర్యపోయేలా సరికొత్త రికార్డ్ సృష్టించిన గౌతమ్ అదానీ.. 100 బిలియన్ల డార్లతో..
Updated on: Apr 07, 2021 | 7:44 PM

కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరోగమనంలో పయనిస్తుంటే.. దేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త మాత్రం తన సంపదను రెట్టింపు చేసుకుంటూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. వ్యాపార దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా సరికొత్త విజయాలను నమోదు చేస్తున్నారు. ఆయనే గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. 2020 సంవత్సరం యావత్ ప్రపంచానికి చేదు జ్ఞాపకం అయితే.. ఆయనకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంగా పేర్కొనవచ్చు.

గౌతమ్ అదానీ ఆదాయం ఏడాది కాలంలో గణనీయంగా పెరిగింది. అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌లో చేరింది. దీంతో రతన్ టాటా, ముఖేష్ అంబానీ సరసన అదానీ చేరినట్లయ్యింది.

అధికారిక సమాచారం ప్రకారం.. అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది. ఈ గ్రూప్‌నకు సంబంధించిన ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయబడ్డాయి. గతేడాది ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ 480 శాతానికి పైగా పెరిగింది. ఇక గతంలో ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ 1.34 లక్షల కోట్ల రూపాయలు ఉండగా.. ఇది ఇప్పుడు 7.85 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో అదానీ గ్యాస్ ఇండస్ట్రీ షేర్లు అత్యధికంగా 1234 శాతం పెరిగాయి. ఇదే సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ 686 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 850 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్స్ 472 శాతం లాభపడ్డాయి.

గత ఏడాది టాటా గ్రూప్ 99 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 65 శాతం వృద్ధిని సాధించాయి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ .18.15 లక్షల కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ .12.66 లక్షల కోట్లు.

Gautam Adani




