AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Isha Foundation: ఈశా ఫౌండేషన్ శ్మశానవాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ఈశా ఫౌండేషన్ శ్మశానవాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం, 90 మీటర్ల దూర నిబంధన లైసెన్సింగ్‌ను నిషేధించదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇక్కరై బోలువంపట్టి గ్రామ పంచాయతీ ఉత్తర్వులపై దాఖలైన మూడు రిట్ పిటిషన్లను కోర్టు ఇంకా విచారిస్తోంది. లైసెన్స్ పొందిన ప్రాంతంలో మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది.

Isha Foundation: ఈశా ఫౌండేషన్ శ్మశానవాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత
Isha Foundation Crematorium
Anand T
|

Updated on: Jan 28, 2026 | 5:35 PM

Share

ఈశా ఫౌండేషన్ శ్మశానవాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈషా ఫౌండేషన్ కాలభైరవర్ ధగన మండపం నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. తమిళనాడు గ్రామ పంచాయతీ నిబంధనలు ప్రకారం.. నివాస స్థలం లేదా తాగునీటి సరఫరా ఉన్న ప్రాంతాల నుంచి సుమారు 90 మీటర్ల లోపు శ్మశాన వాటికకు లైసెన్స్ మంజూరు చేయడాన్ని నిషేధించలేదని చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ , జస్టిస్ జి. అరుళ్ మురుగన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ నుండి లైసెన్స్ పొందడం మాత్రమే ముందస్తు అవసరం అని కోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.