AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mines: భారత్‌లో బయటపడ్డ బంగారు కొండ.. 100 హెక్టార్లలో భారీగా పసిడి నిల్వలు..! ఎక్కడంటే

ఇండియాకు గోల్డెన్‌ ఛాన్స్‌ తగిలింది. భారత్‌కు గేమ్‌ఛేంజర్‌గా మారనున్న ఆ అతి పెద్ద శుభవార్త ఏంటో తెలుసా..? మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కియోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది.

Gold Mines: భారత్‌లో బయటపడ్డ బంగారు కొండ.. 100 హెక్టార్లలో భారీగా పసిడి నిల్వలు..! ఎక్కడంటే
Gold Mines
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2025 | 8:11 AM

Share

ఇండియా జాక్‌పాట్‌ కొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కియోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఒకటి రెండూ కాదు ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో భారీగా పసిడి నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవాన్ కియోలారి అంతటా మట్టి నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపి, రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా, రాగి, ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది. దీనికి GSI అనేక పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం, రాగి, ఇతర విలువైన ఖనిజాల జాడలను వెల్లడించింది.

100 హెక్టార్లలో విస్తరించిన బంగారు నిక్షేపాలు..లక్షల టన్నులు ఉండొచ్చని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని GSI శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇక్కడ పసిడి తవ్వకాలు వాణిజ్యపరంగా లాభసాటి కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి అని, ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి అన్నారంటే, ఇది ఎంత పెద్ద ఆవిష్కారమో అర్థం చేసుకోవచ్చు. ఇక జబల్‌పూర్‌ గోల్డ్‌మైన్‌.. భారత్‌కు గేమ్‌ఛేంజర్‌ కానుందని GSI చెబుతోంది. దీంతో కొత్త బంగారు భారతం ఆవిష్కృతం కానుందని నిపుణులు చెబుతున్నారు.

పూర్తిగా ధృవీకరించబడితే.. ఇది భారతదేశంలో అత్యంత ఖనిజ సంపన్న ప్రాంతాలలో జబల్‌పూర్‌ ఒకటిగా మారనుంది..

ఈ వార్త వ్యాపించగానే గ్రామాల్లో ఆనందం వెల్లువిరిసింది.. అయితే, బంగారానికి సంబంధించిన కణాలు కనుగొనబడినప్పటికీ, అక్కడ పెద్ద బంగారు గని ఉందా లేదా భారీ నిక్షేపం ఉందా అనేది ఇంకా ధృవీకరించాల్సి ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా అన్నారు.

అక్కడ నిజంగా ఎంత బంగారం నిల్వలు ఉన్నాయో.. తెలుసుకునేందుకు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.

గ్రామ పెద్ద రామరాజ్ పటేల్ మాట్లాడుతూ, తమ భూమిలో బంగారు రేణువులు కనిపించాయని వార్తలు వ్యాపించగానే గ్రామంలోని ప్రజలు చాలా సంతోషించారని అన్నారు. తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని చాలా మంది గ్రామస్తులు సందర్శిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..