గ్రామానికి రోడ్డు కావాలని అడిగిన గర్భిణీలు.. ఎంపీ, మంత్రి షాకింగ్ కామెంట్స్
దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయి. పలు గ్రామాలకు రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు కావాలంటూ పలువురు గర్భిణీలు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఎంపీ, మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు దాటినా.. చాలా గ్రామాలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలిచిందని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు దేశంలోని గ్రామాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఎన్నో మారుమూల గ్రామాలకు రోడ్డు వసతి లేక అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక గర్భిణీల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. సరైన రోడ్లు లేక ఎంతో మంది గర్భిణీలు నరకయాతన పడిన ఘటనలు కోకొల్లలు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు అద్దం పడుతోంది. సిధి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది గర్భిణీ స్త్రీలు తమ గ్రామానికి రోడ్డు కావాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఆ అంశంపై ఎంపీ, మంత్రి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఖడ్డీ ఖుర్ద్ గ్రామానికి సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు ఆస్పత్రులకు వెళ్లాలంటే అరిగోస అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో లీలా సాహు అనే మహిళ గ్రామంలోని కొంతమంది గర్భిణీలతో కలిసి తమకు రోడ్డు కావాలంటూ 2023లో ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌ను ప్రధాని మోడీతో పాటు నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేసింది. ‘‘మధ్యప్రదేశ్ నుంచి 29మంది ఎంపీలను గెలిపించాం. కానీ మేం రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నాం’’ అని రాసుకొచ్చింది. లీలాకు సోషల్ మీడియాలో లక్ష మంది ఫాలోవర్లు ఉండడంతో అది వైరల్‌గా మారింది. దీంతో తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని స్థానిక కలెక్టర్ సహా ఎంపీ హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచినా ఆ గ్రామానికి రోడ్డు రాలేదు.
ఈ క్రమంలో బీజేపీ ఎంపీ రాజేశ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళ డెలివరీ డేట్‌కు వారం ముందు రోడ్డు వేస్తామని అన్నారు. అంతేకాకుండా ‘‘ ఆమె కోరుకుంటే మా వద్దకు రావచ్చు. ఆమెకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తాం. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అత్యవసరమైతే తమ వద్ద హెలికాఫ్టర్లు ఉన్నాయి. ఆశా కార్యకర్తలతో పాటు అంబులెన్స్‌లు ఉన్నాయి’’ అని అన్నారు. అటవీశాఖ అనుమతుల వల్ల రోడ్డు వేయడం ఆలస్యం అవుతుందని చెప్పారు. ఆన్ లైన్‌లో వీడియో పెట్టగానే సమస్యలు పరిష్కారం కావని మంత్రి రాకేశ్ సింగ్ అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే వారి వద్దకు సిమెంట్, కాంక్రీట్‌తో చేరుకోవాలా అని ప్రశ్నించారు. బడ్జెట్ పరిమితంగా ఉంటుందని.. నిబంధనల ప్రకారం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీ, మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ये मध्य प्रदेश के “सीधी” से सांसद राजेश मिश्रा है !! इनका काम है जनता की समस्याओं को सुनना है अगर नहीं सुन सकते हैं तो अपनी इस्तीफा दे दो !!
आपके बिना मतलब का ज्ञान सुनने के लिए जनता ने आपको वोट नहीं दिया है
सड़क नहीं बनवाएंगे… ज्ञान पूरा देंगे !!#leelasahu pic.twitter.com/CAXMzg97fE
— Braj Shyam Maurya (@brijshyam8) July 11, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




