MP Election: అలక వీడిన మాజీ సీఎం ఉమా భారతి.. హిమాలయాలకు వెళ్లే ఫ్లాన్ రద్దు..!

మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నవంబర్ 9వ తేదీ గురువారం నుంచి ఆమె మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు.

MP Election: అలక వీడిన మాజీ సీఎం ఉమా భారతి.. హిమాలయాలకు వెళ్లే ఫ్లాన్ రద్దు..!
Uma Bharti
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 08, 2023 | 1:54 PM

మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నవంబర్ 9వ తేదీ గురువారం నుంచి ఆమె మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉమాభారతి ఎన్నికల ప్రచారం సాంచి నుంచి ప్రారంభం కానుంది. ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించకముందే రాజకీయాల్లో మరోసారి యాక్టివ్‌గా మారారు. ఈ క్రమంలోనే తీర్థ దర్శన్ పథకంపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనను కూడా ఆమె తప్పుబట్టారు.

మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సిల్వానీలోని బమ్‌హోరీ, సాగర్‌లోని సుర్ఖీలో కూడా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తారని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, దీనికి ముందు ఉమాభారతి ప్రచారానికి నిరాకరించి హిమాలయాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆమె పేరు లేకపోవడంతో కొంత అసహానానికి గురయ్యారు. దీనిపై ఉమాభారతి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తనను ఎక్కడ ప్రచారానికి పిలిచినా అక్కడికే వెళతానని ఉమాభారతి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

గత కొన్ని రోజుల క్రితం లలిత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉమాభారతి కిందపడిపోయారు. తన ఎడమ కాలికి గాయమైనట్లు ట్వీట్టర్ వేదిక వెల్లడించారు. అగస్టు 28 నుంచి ఝాన్సీలో ఫిజియోథెరపీ తీసుకుంటున్నారు. ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో ఝాన్సీలోనే ఎంఆర్‌ఐ చేయించారు. వైద్యుల సూచనల మేరకు భోపాల్‌కు తిరిగి వచ్చారు. దాదాపు 3 నెలల పాటు చికిత్స, ఫిజియోథెరపీ, మందులు, విశ్రాంతితో సహా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తాజాగా మరోసారి ఆమె రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు.

ఇటీవలె, తీర్థ దర్శన్ పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాదనను తప్పుగా పేర్కొంటూ, ఉమాభారతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ X లో రాశారు. “కేజ్రీవాల్ జీ అధిక ఒత్తిడితో అలసిపోయారు. అతని జ్ఞాపకశక్తి బలహీనపడింది. ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన మొట్ట మొదట మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ జీ ప్రారంభించారు.” అని పేర్కొన్నారు.

ఉమాభారతి కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను చెప్పాల్సినవన్నీ చెప్పానని, ఇప్పుడు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తు నిర్ణయం తీసుకుంటారని ఉమా భారతి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!