Lok Sabha Election 2024 Highlights: ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్‌.. ఏ రాష్ట్రంలో ఎంత శాతం అంటే..

| Edited By: Subhash Goud

Apr 19, 2024 | 5:55 PM

Lok Sabha Poll 2024 Phase 1 Voting Live News and Updates in Telugu: లోక్‌సభ సమరానికి తెరలేసింది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు లక్షా 87 వేల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు..

Lok Sabha Election 2024 Highlights: ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్‌.. ఏ రాష్ట్రంలో ఎంత శాతం అంటే..
Lok Sabha Election

Lok Sabha Poll 2024 Phase 1 Voting Live News and Updates in Telugu: లోక్‌సభ సమరానికి తెరలేసింది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు లక్షా 87 వేల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలతో పాటు అరుణాచల్‌, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా నేడు ఎన్నికలు జరిగాయి.

మొదటి దశలో మిగతా దశల కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండటం అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానంగా మారాయి. మొదటి విడతలో ఆధిక్యం చూపితే అది మిగతా దశల్లో కూడా ఆ ఆధిక్యం కొనసాగుతుందని పార్టీలు ఆశిస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇంతవరకు సొంతంగా విజయం రుచి చూడని తమిళనాడులో, తొలిసారిగా కేరళలో విజయం సాధించాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపుపై గట్టి ఆశలే పెట్టుకున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Apr 2024 05:53 PM (IST)

    ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్‌.. ఏ రాష్ట్రంలో ఎంత శాతం అంటే..

    దేశంలో తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొదటి విడతలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్ఛిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి లలో ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగింది. అయితే పోలింగ్‌ ముగిసే సమయానికి అంటే సాయంత్రం 5 గంటల వరకు పశ్చిమబెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు ఏయే రాష్ట్రాల్లో ఎంత శాతం పోలింగ్‌ నమోదైందో తెలుసుకోండి.

    Elections Polling

  • 19 Apr 2024 05:11 PM (IST)

    ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా తృణమూల్ కార్యకర్త మృతి

    పశ్చిమబెంగాల్‌లో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా ఓ తృణమూల్ కార్యకర్త మృతి చెందాడు. మృతుడి పేరు సుశీల్ బర్మన్. వయస్సు 70 సంవత్సరాలు. ఈ సంఘటన మథభంగా 1 బ్లాక్‌లోని కేదార్‌హట్ గ్రామ పంచాయతీలోని జోర్షిములి ప్రాంతంలో జరిగింది. అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడే మృతి చెందినట్లు సమాచారం.


  • 19 Apr 2024 04:50 PM (IST)

    3 గంటల వరకు ఎక్కడ ఎంత పోలింగ్‌ శాతం

    దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కడ ఎంత శాతం పోలింగ్‌ జరిగిందో తెలుసుకోండి.

    Polling

  • 19 Apr 2024 04:32 PM (IST)

    యూపీలో 8 స్థానాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 47% ఓటింగ్‌

    ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు యూపీలో 47.44 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు సహరాన్‌పూర్‌లో 53.31 శాతం ఓట్లు పోలవ్వగా, కైరానాలో 48.92 శాతం, ముజఫర్‌నగర్‌లో 45.18 శాతం, బిజ్నోర్‌లో 45.70 శాతం, నగీనాలో 48.15 శాతం, మొరాదాబాద్‌లో 46.28 శాతం, రాంపూర్‌లో 40.74 శాతం ఓట్లు పోలయ్యాయి.

  • 19 Apr 2024 03:53 PM (IST)

    అక్కడక్కడ చిన్నపాటి గొడవలతో పోలింగ్‌

    దేశంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్నపాటి గొడవలతోపాటు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

  • 19 Apr 2024 03:26 PM (IST)

    తొలి విడతలో ఓటింగ్‌

    ఈ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు లక్షా 87 వేల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలతో పాటు అరుణాచల్‌, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా నేడు ఎన్నికలు జరగుతున్నాయి.

  • 19 Apr 2024 02:59 PM (IST)

    బస్తర్‌లో నక్సల్స్‌పై ఓటింగ్‌ ఎంత ప్రభావం చూపింది

    మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో నక్సల్స్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు 42.57 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. వీటిలో కొండగావ్, నారాయణపూర్, చిత్రకోట్, దంతేవాడ, బీజాపూర్, కొంటా, జగదల్‌పూర్‌లోని 72 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ప్రాంతాల్లోని ఓటర్లు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

  • 19 Apr 2024 02:03 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు..

    తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నాగ్‌పూర్‌లో ఓటు వేసిన మోహన్ భగవత్, నితిన్ గడ్కరీ ఓటు వేశారు. రాజస్థాన్‌ జయపురలో ఓటు వేసిన సీఎం భజన్‌లాల్ శర్మ, అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్‌లో ఓటు వేసిన సీఎం పెమా ఖండూ. మిజోరాం ఐజ్వాల్‌లో గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ఓటు వేశారు.

  • 19 Apr 2024 01:30 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్‌..

    తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు త్రిపురలో అత్యధికంగా 33.86 శాతం కాగా, బెంగాల్‌ – 33.56% , మధ్యప్రదేశ్‌ – 30.46% , తమిళనాడు – 24%, అత్యల్పంగా లక్షద్వీప్‌లో – 16.33శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • 19 Apr 2024 12:00 PM (IST)

    ఓటు వేసి.. స్ఫూర్తినిచ్చి.

    తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కాసిమేడు ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన వారం రోజుల వయసున్న చిన్నారితో పాటు ఓటు వేయడానికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతీ ఒక్కరి విధి అని, ప్రతీ ఒక్కరూ తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు

  • 19 Apr 2024 11:10 AM (IST)

    మహారాష్ట్రలో ప్రశాంతంగా పోలింగ్‌..

    మహారాష్ట్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని కొమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని 14 గ్రామాలకు చెందిన ఓటర్లు.. చంద్రాపూర్ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

  • 19 Apr 2024 09:58 AM (IST)

    కొనసాగుతోన్న పోలింగ్‌..

    దేశంలో తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు. సీఎం స్టాలిన్, తమిళిసై, పళనిస్వామి, పన్నీర్ సెల్వం, అన్నామలై ఓటు వేశారు. వీరితో పాటు రజినీకాంత్, కుష్బూ, కార్తీక్‌, అజిత్‌, శివకార్తీకేయన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 19 Apr 2024 09:22 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

    తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజకీయ నేతలు, ప్రముఖులు. శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం. ఇక సేలంలో ఓటు వేస మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి. చెన్నై శాలిగ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్. చెన్నై సౌత్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. చెన్నై తిరువాన్మయూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హీరో అజిత్. నాగ్‌పూర్‌ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌.

  • 19 Apr 2024 08:31 AM (IST)

    అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే..

    తొలి విడత పోలింగ్‌లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్‌ నటి రాధిక బీజేపీ తరఫున విరుధ్‌నగర్‌ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా DMDK వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

  • 19 Apr 2024 08:08 AM (IST)

    పలు ప్రాంతాల్లో మొదలైన పోలింగ్‌..

    దేశంలో తొలి విడత లోక్‌సభ ఎన్నికల సమరం మొదలైంది. తొలిదశలోనే తమిళనాడులోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌నకు జరుగుతోంది. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒక స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో DMK, ADMK, BJP మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే తొలిసారి అత్యధికంగా 23 స్థానాల్లో బీజేపీ పోటీ దిగింది

  • 19 Apr 2024 07:51 AM (IST)

    బరిలోకి దిగిన ప్రముఖులు వీళ్లే..

    మొదటి విడత ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వారిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి బరిలో ఉన్నారు. మరో ప్రముఖుడు జితిన్‌ ప్రసాద్‌ యూపీలోని పిలిభిత్‌ లోకసభ నియోజక వర్గం నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై చెన్నై సౌత్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తన తండ్రి ఏడుసార్లు నెగ్గిన శివగంగ లోక్‌సభలో పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తమిళనాడు అధ్యక్షుడైన అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీలో ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ బరిలో ఉన్నారు.

  • 19 Apr 2024 07:21 AM (IST)

    ఈ ప్రాంతాల్లో భద్రత పెంపు..

    ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న  బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది.

  • 19 Apr 2024 07:02 AM (IST)

    ఏయే రాష్ట్రాల్లో తొలి దశ పోలింగ్ జరగనుందంటే..

    మొదటి విడతలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్ఛిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగతున్నాయి.

Follow us on