AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Jobs: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు.. త్వరలో నోటిఫికేషన్‌! రాత పరీక్షలేకుండానే ఎంపిక

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి ఇండియన్‌ పోస్ట్‌ సమాయాత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది..

Post Office Jobs: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు.. త్వరలో నోటిఫికేషన్‌! రాత పరీక్షలేకుండానే ఎంపిక
Post Office GDS
Srilakshmi C
|

Updated on: Apr 19, 2024 | 6:38 AM

Share

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి ఇండియన్‌ పోస్ట్‌ సమాయాత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పదో తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారిని బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌.. హోదాలో విధులు సంబంధిత కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ విధులను కూడా నిర్వహించవచ్చు. ఇందుకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

APRJC 2024 హాల్‌ టికెట్లు

ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ 2024, ఏపీఆర్‌జేసీ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్ధులు తమ వివరాలను నమోదు చేసి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఏప్రిల్ 25న ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
చలికాలంలోనూ పిండి చక్కగా పులియాలంటే ఈ ట్రిక్ పాటించండి!
చలికాలంలోనూ పిండి చక్కగా పులియాలంటే ఈ ట్రిక్ పాటించండి!
ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్
ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారు.. అమిత్ షా ఫైర్
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారు.. అమిత్ షా ఫైర్
అరటిపండు తొక్కలను పారేయకండి-ఒత్తైన,పొడవాటి జుట్టు కోసం ఇలా వాడితే
అరటిపండు తొక్కలను పారేయకండి-ఒత్తైన,పొడవాటి జుట్టు కోసం ఇలా వాడితే
పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!
పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!