Loan moratorium Case : రుణ మారటోరియం గడువు పొడిగించలేం, వడ్డీ మాఫీ చేయలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ,
రుణమారటోరియం గడువు పొడిగించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. 2020 లో మొత్తం 6 నెలల మారటోరియం కాలంలో తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయజాలమని కూడా కోర్టు పేర్కొంది.
Loan moratorium Case : రుణమారటోరియం గడువు పొడిగించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. 2020 లో మొత్తం 6 నెలల మారటోరియం కాలంలో తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయజాలమని కూడా కోర్టు పేర్కొంది. లోన్ మారటోరియం కేసుపై విచారణ జరిపిన కోర్టు.. లెండర్లు కూడా షేర్ హోల్డర్లు, డిపాజిటుదారులకు, చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అందువల్ల పూర్తి వడ్డీ మాఫీ సాధ్యం కాదని తెలిపింది. పెన్షనర్లు, ఖాతాదారులకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.. పైగా రుణ మారటోరియం పాలసీలో ఆర్ బీ ఐ, ప్రభుత్వం పాటించే విధానాల్లో మేం జోక్యం చేసుకోజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఒక పాలసీ అన్నది లోప భూయిష్టంగా ఉందని భావించినప్పుడు తప్ప ఇతరత్రా ఈ విధమైన వ్యవహారాల్లో మేం కలగజేసుకోబోమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడినబెంచ్ పేర్కొంది .సాధారణంగా జ్యూడిషియల్ రివ్యూ అన్న ప్రసక్తి ఉండదు అవి వివరించింది. అయితే మారటోరియం పీరియడ్ లో వాయిదా వేసిన వడ్డీపై చక్రవడ్డీ ఉండదని కూడా బెంచ్ వివరించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మారటోరియంపై వడ్డీపై వడ్ఢేని మాఫీ చేయాలనీ , మారటోరియంని పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై ముగ్గురు జడ్జీల బెంచ్ విచారణ జరిపింది.
ఆరు నెలల రుణ మారటోరియం కాల పరిమితి గత ఏడాది ఆగస్టు 31 తో ముగిసింది. కానీ ఈ కాల పరిమితిని పొడిగించలేమన్న న్యాయస్థానం.. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కూడా ఆయా రంగాల వారీగా స్పెసిఫిక్ ఊరటనిస్తే ఇవ్వవచ్చునని అభిప్రాయపడింది. కోవిడ్ కారణంగా ప్రభుత్వం కూడా నష్ట పోయిందని, ఈ కారణంగా ఒక నిర్దిష్ట పాలసీని ప్రకటించాలని సర్కార్ ని ఆదేశించలేమని వివరించింది. సమగ్ర సంప్రదింపుల తరువాత కేంద్రం, ఆర్ బీ ఐ కూడా ఏదేని ఫైనాన్షియల్ ప్యాకేజీని గానీ, పాలసీని గానీ ప్రకటించాల్సి ఉంటుంది అని ఈ బెంచ్ పేర్కొంది. పర్సనల్, హౌసింగ్, విద్య, ఆటో కన్స్యూమర్ రుణాలతో బాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ మాఫీని ఉద్దేశించారు. గత ఏడాది మార్చి-ఆగస్టు మధ్య రూ. . 2 కోట్ల వరకు ఉన్న రుణాల తిరిగి చెల్లింపులను నవంబరు 5 లోగా ఆయా చక్రవడ్డీ లేదా సాధారణ వడ్డీ చెల్లింపుల తేడాను గుర్తించి క్రెడిట్ చేయవలసిందిగా ఆర్ బీ ఐ లోగడ బ్యాంకులను, ఇతర ఆర్ధిక సంస్థలను ఆదేశించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.