యూపీలో పిడుగుల వర్షం..

యూపీలో ఆదివారం కురిసన పిడుగుల వర్షాలు.. బీభత్సాన్ని సృష్టించాయి. పిడుగుల దాటికి మొత్తం 32 మంది మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని కాన్పూర్, ఫతేపూర్, ఝాన్సీ, జలాన్, హామీపూర్, ఘాజీపూర్, జాన్ పూర్, ప్రతాప్ ఘడ్, చిత్రకూట్ ప్రాంతాల్లో..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు.. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో 32 మంది మృతిచెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు వల్ల మరణించిన కుటుంబాల వారికి […]

యూపీలో పిడుగుల వర్షం..
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 8:19 AM

యూపీలో ఆదివారం కురిసన పిడుగుల వర్షాలు.. బీభత్సాన్ని సృష్టించాయి. పిడుగుల దాటికి మొత్తం 32 మంది మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని కాన్పూర్, ఫతేపూర్, ఝాన్సీ, జలాన్, హామీపూర్, ఘాజీపూర్, జాన్ పూర్, ప్రతాప్ ఘడ్, చిత్రకూట్ ప్రాంతాల్లో..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు.. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో 32 మంది మృతిచెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు వల్ల మరణించిన కుటుంబాల వారికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఎం యోగీ ఆదిత్యానాథ్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను తెలిపారు.