AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Ayodhya Visit: ఆ రోజున ఎవరూ అయోధ్యకు రావద్దు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి..!

అయోధ్యలో మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్‌ తోపాటు మహర్షి వాల్మీకి ఎయిర్‌​పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు.

PM Modi Ayodhya Visit: ఆ రోజున ఎవరూ అయోధ్యకు రావద్దు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి..!
Pm Modi In Ayodhya
Balaraju Goud
|

Updated on: Dec 30, 2023 | 5:12 PM

Share

అయోధ్యలో సుందర శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో అయోధ్యలో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజున సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలగాలన్నారు. అందుకే జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు. ప్రజలు ఎవరూ అయోధ్యకు వచ్చి ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు.

అయోధ్యలో మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్‌ తోపాటు మహర్షి వాల్మీకి ఎయిర్‌​పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జనవరి 22న అయోధ్యకు రావద్దని ప్రజలను కోరారు.

మీరు 550 సంవత్సరాలకు పైగా వేచి ఉన్నారు, మరికొంత కాలం వేచి ఉండండి అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని కోరారు. ఆ రోజున సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలగాలన్నారు. కాగా ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లంకను జయించి.. సీతాదేవితో కలిసి శ్రీ రాముడు అయోధ్య కు తిరిగొచ్చాడని అంటారు. రామయ్య రాకను స్వాగతిస్తూ అయోధ్య ప్రజలు దీపాలు వెలిగిస్తారట. ప్రస్తుతం రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో మోదీ ఈ మేరకు పిలుపునిచ్చారు.

జనవరి 22న జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ స్వయంగా అయోధ్యకు రావాలని కోరుకుంటారని, అయితే అందరూ రావడం సాధ్యం కాదని, అందుకే జనవరిలో నిర్వహించే కార్యక్రమాన్ని ఒక్కసారిగా అయోధ్యకు తరలిరావాలని కోరుతున్నాను. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట తరువాత, తమ సౌలభ్యం ప్రకారం అయోధ్యకు రావాలని సూచించారు. జనవరి 22న ఇక్కడికి రావడానికి తమ మనస్సును మార్చుకోకండి అంటూ విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ.

ఈ మహత్తర కార్యక్రమానికి సన్నాహాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయని, ఇందులో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. గుడి ఎక్కడికీ వెళ్లదు కాబట్టి ఇక్కడ రద్దీగా ఉండకండి. ఇది శతాబ్దాల పాటు కొనసాగుతుంది. ఈ వేడుకకు కొందరికే ఆహ్వానం అందిందని ప్రధాని తెలిపారు. అందుచేత ఆహ్వానించబడిన వారు మాత్రమే అయోధ్యకు రావాలన్నారు. జనవరి 23వ తేదీ తర్వాత ప్రతి ఒక్కరికి ఆయోధ్య ప్రయాణం సులువవుతుందన్నారు.

రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రజలందరూ తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక ఘట్టం అదృష్టవశాత్తూ మనందరి జీవితాల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా 140 కోట్ల మంది దేశప్రజలు జనవరి 22న తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా, అయోధ్య నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. అయోధ్య ఇప్పుడు లక్షలాది మంది సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలన్నారు. నిత్యం సందర్శకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అయోధ్యను దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు అయోధ్య ప్రజలు ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..