AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోకి స్లీపర్ సెల్స్.. ప్రాణాలు తీసేస్తున్నారు.. లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణశాఖ మాజీ ముఖ్య సలహాదారులు వినోద్ జి.ఖండారో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణకు సంబంధించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్లీపర్ సెల్స్ లోపలికి ప్రవేశించాయని అన్నారు.

దేశంలోకి స్లీపర్ సెల్స్.. ప్రాణాలు తీసేస్తున్నారు.. లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు
Vinod
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2025 | 9:51 PM

Share

రక్షణశాఖ మాజీ ముఖ్య సలహాదారులు, లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి.ఖండారో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని స్లీపర్ సెల్స్ ప్రవేశించాయని, వాళ్లు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సిగ్మా ఎడ్వాన్స్‌డ్ సిస్టమ్ సంస్థ అభివృద్ది చేసిన యాంటీ డ్రోన్ వెహికల్ ఇంద్రజాల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ ఖండారో మాట్లాడుతూ.. దేశంలోని స్లీపర్ సెల్స్ ప్రవేశించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో జాగ్రత్తగా ఉండాలని, మనల్ని రక్షించుకోవడానికి కౌంటర్ డ్రోన్ పరిష్కారాలు చాలా అవసమని సూచించారు. మనం దూరదృష్టి కలిగి ఉండాలని, అప్పుడే యుద్దాల్లో విజయం సాధింగచలమని వ్యాఖ్యానించారు.

సైన్యం అంటే యుద్దాలను ఆపేడమే కాదని, యుద్దాన్ని నివారించడం కూడా అని వినోద్ ఖండారో స్పష్టం చేశారు. బలం అంటే కేవలం సైన్యం సంఖ్యలో కాదని, సామర్థ్యంలో ఉండాలన్నారు. ప్రజలు కావాలనుకున్నప్పుడే సైన్యం యుద్దంలోకి దిగుతుందని, బలమైన సైన్యం ఎప్పుడూ యుద్దం జరగకుండా నివారిస్తుందని తెలిపారు, విజయం అంటే కేవలం క్రీడలు, ఆర్ధిక, విజ్ఞానం, టెక్నాలజీనే కాదని, యుద్దంలో కూడా అని అన్నారు. మన దేశం చుట్టూ మొత్తం శత్రు దేశాలే ఉన్నాయని, మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. మన చుట్టూ ఉన్న శత్రుదేశాలను అర్ధం చేసుకుని వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాలని వినోద్ ఖండారో సూచించారు.

ఆధునిక సైన్యం కోసం దేశం మొత్తం చూస్తుందని, సిగ్నా లాంటి వాళ్లు నిజమైన సైనికులు అంటూ ఆయన కొనియాడారు. ఇలాంటి వాళ్లు ఎల్‌ఓసీ, ఎల్‌ఏసీ, అంతర్జాతీయ సరిహద్దుల్లో సైనికులను బలోపేతం చేస్తున్నాయిన ప్రశ్నించారు.సిగ్నా సంస్థ అభివృద్ది చేసిన ఇంద్రజాల్ లాంటివి మన దేశానికి చాలా అవసరమని, ఇది చాలా స్పూర్తిదాయకమని వినోద్ ఖండారో అన్నారు. మనంలోని విబేధాలను అందరూ పక్కనపెట్టి దేశం కోసం ఆలోచించాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా ప్రజలందరూ అడుగు వేయాలని స్పష్టం పేర్కొన్నారు.

తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
సంక్రాంతి సందర్భంగా వినూత్నరీతిలో గ్రామీణ వేడుక..
సంక్రాంతి సందర్భంగా వినూత్నరీతిలో గ్రామీణ వేడుక..
పచ్చి కొబ్బరి నెలరోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌
పచ్చి కొబ్బరి నెలరోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌
ఎన్నో రోగాలకు దేవుడిచ్చిన ప్రసాదం సొరకాయ..
ఎన్నో రోగాలకు దేవుడిచ్చిన ప్రసాదం సొరకాయ..
వార్నీ.. ChatGPT సృష్టికర్త సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?
వార్నీ.. ChatGPT సృష్టికర్త సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?
హీరో శివ కార్తికేయన్ భార్య, పిల్లలను చూశారా? ఫొటోస్ వైరల్
హీరో శివ కార్తికేయన్ భార్య, పిల్లలను చూశారా? ఫొటోస్ వైరల్
చేతుల్లోంచి ఈ వస్తువులు తరచూ జారిపోతున్నాయా? అశుభానికి సంకేతమే
చేతుల్లోంచి ఈ వస్తువులు తరచూ జారిపోతున్నాయా? అశుభానికి సంకేతమే