Lata Mangeshkar Passes Away: శివాజీపార్క్‌లో గాన కోకిల లతా మంగేష్కర్‌కు కన్నీటి వీడ్కోలు
Lata Mangeshkar Funeral Live updates: నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న లతాజీ.. గానాభిలాషుల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటలతో అలరించారు గాన కోకిల.
Nightingale of India Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. యావత్ దేశాన్ని, ప్రపంచ సంగీత ప్రియులను శోకసంద్రంలోకి నెట్టి దివికేగారు గాన కోకిల. సాయంత్రం లతాజీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. శివాజీ పార్క్‌లో లతాజీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8.12 నిమిషాలకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు నైటింగేల్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి పెద్దర్ రోడ్‌లోని లతాజీ నివాసం ప్రభుకుంజ్‌కు తరలించారు. పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ప్రభుకుంజ్‌లోని ఇంట్లోనే లతా పార్థీవదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. బాలీవుడ్ ప్రముఖులు ఆమెను కడసారి చూసేందుకు వస్తున్నారు. గానకోకిలకు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. లతాజీ మనల్ని వదిలి స్వర్గానికి వెళ్లిపోయారు. ఆమె మరణంతో యావత్ దేశం దుఃఖ సాగరంలో మునిగిపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతరత్న లతా మంగేష్కర్ భౌతికంగా దూరమైనా ఆమె పాటలతో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. గానకోకిలతో భారమైన హృదయంతో నివాళులర్పిస్తున్నానన్నారు.
లతా మంగేష్కర్ మృతిపట్ల సీఎం ఉద్ధవ్ థాక్రే సంతాపం ప్రకటించారు. లతాజీ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు ఉద్ధవ్ థాక్రే. రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్‌లో..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం..లతాజీ పార్థివదేహాన్ని స్వగృహంలో ఉంచనున్నారు. లతామంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతి. ఆ దంపతులకు మొదటి సంతానం లతామంగేష్కర్. అతి చిన్న వయసులోనే..ముద్దు ముద్దు మాటల సమయంలోనే.. తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు స్వరకోకిల. లతా మంగేష్కర్‌కు నలుగురు సోదరీమణులు. 13ఏళ్ల వయసులోనే తండ్రి మరణంతో కుటుంబభారమంతా లతాజీనే మోయాల్సి వచ్చింది. తన కంటే చిన్నవారైన చెల్లెల్ల బాగోగులు చూసుకోవడానికి ఇంటికి పెద్దదిక్కుగా మారారు లతా మంగేష్కర్. తన జీవితాన్ని వారికే అంకితం చేశారు. 13 ఏళ్ల నుంచే తన సుస్వరాలతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. తన సుస్వరాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు.
లతా మంగేష్కర్ ఒక నిరంతర విద్యార్థిని. దేశం గర్వించే స్థాయికి ఎదిగినా…. లెక్కకు మించిన అవార్డులు, రివార్డులు దక్కించుకున్నా.. నిత్యం సాధన ఆమె సక్సెస్ మంత్రా. సంగీత దర్శకులు పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లయినా.. ఆమె ఇచ్చే గౌరవం మాత్రం ఒకేలా ఉండేది. సంగీత దర్శకుడు కొత్తవాడైనా, ఆ బాణీలు ఎంత చిన్నవే అయినా ఆమె మాత్రం ప్రేమగా ప్రాక్టీస్ చేసేవారు. వేలాది పాటలు పాడిన అనుభవం ఉన్నా.. ప్రతీపాటా ఆమెకు కొత్తే. రికార్డింగ్ కు వెళ్లే ముందు సంగీత దర్శకుడు ఏం కోరుకుంటున్నాడు.. అతనికి ఎలా అయితే బాణీ నచ్చుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకుని, నేర్చుకుని, సాధన చేసి.. అంతిమంగా ఆ పాటకు ప్రాణం పోసేవారు. తన సుస్వరాల ఒడిలో ఓలలాడించిన స్వర కోకిల..గగనానికేగిందని శోకసంద్రంలో మునిగిపోయింది.
లతా మంగేష్కర్ జీవితంలో ఓ మ్యాజికల్ మూమెంట్. ఆ క్షణం లేకుంటే లతాజీ గొప్ప గాయనిగా ఆవిర్భవించే వారే కాదు. ప్రపంచం ఓ గొప్ప గాయనిని కోల్పోయేది. లతాకు 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి వద్ద ఓ పిల్లాడు సంగీతం నేర్చుకునే వాడని…ఓ రోజు తన తండ్రి చెప్పిన పాటను ఆ కుర్రాడు సరిగా పాడలేకపోతే… వీధిలో ఆడుకుంటున్న లతా ఆ పిల్లాడి పాటలో లోపం చెప్పారట. చెప్పడమే కాదు ఆపాటను లయబద్ధంగా పాడి వినిపించారట… అది గమనించిన ఆమె తండ్రి..నా కుమార్తెలో ఉన్న టాలెంట్ ను నేను గమనించలేకపోయానని గమనించి.. మరుసటి రోజు నుంచి లతా మంగేష్కర్ ను సంగీత సాధనలో కూర్చోపెట్టారట. అలా ఆమె సుస్వర గాన సాగరం ప్రారంభమైందని ఆమె గతంలో ఓసారి చెప్పుకున్నారు. దటీజ్ రియల్లీ మేజికల్ మూమెంట్.
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న లతాజీ.. గానాభిలాషుల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటలతో అలరించారు గాన కోకిల. 13వ ఏటనే పాటతో ప్రయాణం మొదలుపెట్టి…80ఏళ్లలో మొత్తం 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రపంచాన్ని ఓలలాండిచారు లతా మేడమ్. లగ్ జా గలే, యే గలియా యే చౌబారా… బాహోం మే చలే ఆవో… ప్యార్ కియా తో డర్నా క్యా.. ఇలా ఒకటేంటి వేలకువేల పసిడి పాటలతో ప్రాచుర్యం పొందారు లతా మంగేష్కర్.
తన సినీ ప్రయాణంలో లతా మంగేష్కర్ తొలిసారిగా 1955లో తెలుగులో పాటను ఆలపించారు. అక్కినేని నాగేశ్వర రావు నటించిన ‘సంతానం’ సినిమాలో నిదురపోరా తమ్ముడా పాటతో అలరించారు. ఈ సాంగ్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక 1965లో ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో శ్రీ వెంకటేశ్వర అనే పాటను పాడారు. ఆ తర్వాత 1988లో వచ్చిన నాగార్జున మూవీ ఆఖరి పోరాటం’లో తెల్ల చీరకు అంటూ సాగే డ్యూయట్‌ను ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి పాట పాడారు.
LIVE NEWS & UPDATES
-
పంచభూతాల్లో కలిసిన గాన కోకిల
ముంబైలోని శివాజీ పార్క్‌లో ‘గాన కోకిల’ లతా మంగేష్కర్ పంచభూతాల్లో కలిసిపోయారు.
मुंबई: शिवाजी पार्क में भारत रत्न लता मंगेशकर के पार्थिव शरीर का अंतिम संस्कार किया गया। #LataMangeshkar pic.twitter.com/OsO7hsDxNa
— ANI_HindiNews (@AHindinews) February 6, 2022
-
లతా మంగేష్కర్ కుటుంబాన్ని ఓదార్చిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశంలోని పలువురు ప్రముఖులు శివాజీ పార్కుకు చేరుకుని ‘స్వర కోకిల’కు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కలుకుని ఓదార్చారు.
Paid my last respects to Lata Didi in Mumbai. pic.twitter.com/3oKNLaMySB
— Narendra Modi (@narendramodi) February 6, 2022
-
-
చితికి నిప్పు పెట్టిన సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్
ప్రభుత్వ లాంఛనాలు పూర్తి అయ్యాక, లతా మంగేష్కర్ అంత్యక్రియల చితిపై ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ అగ్నిని వెలిగించారు.
-
క్వీన్ ఆఫ్ మెలోడీ అంత్యక్రియలు పూర్తి
క్వీన్ ఆఫ్ మెలోడీ లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. ముంబైలోని శివాజీ పార్క్‌లో అశృనయనాల మధ్య జరిగాయి. ఏడు దశాబ్ధాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన లతా మంగేష్కర్‌కు.. ప్రముఖులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, అధికారులు.. గాన కోకిల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భారతీయ గాన కోకిలకు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.
-
శోకసంద్రంతో స్వర మాధుర్యానికి వీడ్కోలు
లతా ‘దీదీ’ చివరి దర్శనం కోసం వేలాది మంది ప్రజలు శివాజీ పార్కుకు చేరుకున్నారు. అందరూ శోకసంద్రంతో స్వర నైటింగేల్‌కి వీడ్కోలు పలికారు.
-
-
గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు
లతా మంగేష్కర్ పార్థీవదేహం నుంచి త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. ఈ త్రివర్ణ పతాకాన్ని మంగేష్కర్ కుటుంబానికి అప్పగించారు. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రక్రియ పూర్తయింది. దీంతో కుటుంబసభ్యులతో సహా అభిమానులు గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు పలికారు.
-
లతా మంగేష్కర్ పార్థీవదేహనికి త్రివిధ దళాల సెల్యూట్
నైటింగేల్ ఆప్ ఇండియా.. గాన కోకిలకు తుది వీడ్కోలు… అధికారిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. త్రివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది కడసారి సెల్యూట్ చేశాయి. లతా ‘దీదీ’కి 21 గన్ సెల్యూట్ అందించారు. అంత్యక్రియల వేడుకకు 8 మంది పండిట్లు మహామృత్యుంజయ మంత్రం పఠనం చేశారు.
-
శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలు
ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అశేష జనవాహిన నడుమ సైనిక లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలుకుతున్నారు.
-
మరికొద్ది సేపట్లో స్వర కోకిలకు అంత్యక్రియలు
మరికొద్దిసేపట్లో లతా దీదీ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని మోడీ సహా దేశంలోని పలువురు ప్రముఖులు శివాజీ పార్కుకు చేరుకుని ‘స్వర కోకిల’కు నివాళులర్పించారు.
-
లతా అంత్యక్రియల్లో ప్రధాని మోడీ
శివాజీ పార్క్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు.
#WATCH | Prime Minister Narendra Modi attends state funeral of veteran singer Lata Mangeshkar https://t.co/6nEuiFXXXo
— ANI (@ANI) February 6, 2022
-
భగవద్గీత, మహామృత్యుంజయ మంత్ర పఠనంతో అంత్యక్రియలు
లతా మంగేష్కర్ అంత్యక్రియలలో భగవద్గీత చదువుతూ, మహామృత్యుంజయ మంత్రం పఠిస్తున్నారు వేదపండితులు. అంత్యక్రియలు నిర్వహించిన పండిట్ జీ ఈ విషయాన్ని తెలిపారు. అంతకుముందు, బాలాసాహెబ్ ఠాక్రే అంత్యక్రియలను పండిట్‌జీ నిర్వహించడం విశేషం.
-
‘తరతరాలుగా భారతీయ సంగీతాన్ని నిర్వచించిన స్వరం’ – మహేష్ బాబు
లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలుపుతూ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ, లతా మంగేష్కర్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరతరాలుగా భారతీయ సంగీతాన్ని నిర్వచించిన స్వరం.. ఆమె వారసత్వం నిజంగా అసమానమైనది. కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమె అభిమానులందరికీ హృదయపూర్వక సానుభూతి. శాంతితో విశ్రాంతి తీసుకోండి లతా జీ. ” అంటూ ట్వీట్ చేశారు.
-
లతా మంగేష్కర్‌కు నివాళులర్పించిన బెంగాలీ సంగీత విద్వాంసులు
సంగీత రాణి లతా మంగేష్కర్ మరణానంతరం బెంగాల్ ప్రముఖ సంగీత విద్వాంసులు ఆమెకు నివాళులర్పించారు. ప్రముఖ సంగీత స్వరకర్త సలీల్ చౌదరి కుమార్తె అంతరా చౌదరి మాట్లాడుతూ, “తల్లి సరస్వతి లతాజీ స్వరం ద్వారా నివసిస్తుందని మా నాన్న తరచుగా చెబుతుంటారు.” లతతో కలిసి సలీల్ చౌదరి 35 బెంగాలీ పాటలకు స్వరాలు సమకూర్చారని గుర్తు చేశారు.
-
శివాజీ పార్కుకు చేరుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అజిత్ పవార్, రాజ్ థాకరే, పీయూష్ గోయల్, షారుక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ శివాజీ పార్క్‌కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు చేరుకోనున్నారు.
-
లెజెండరీ సింగర్‌కు అస్సాం సీఎం సంతాపం
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలుపారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. అస్సామీ సంగీతానికి ఆమె చేసిన కృషి ఆమెకు, రాష్ట్ర ప్రజలకు మధ్య వారధిని సృష్టించిందని అన్నారు. బోర్లూయిట్ (అసోంలో బ్రహ్మపుత్రకు మరో పేరు)లా మంగేష్కర్ స్వరం ప్రజల గుండెల్లో మారుమోగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. శర్మ ట్వీట్ చేస్తూ, ‘లతాజీ మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు. అస్సాం ప్రజలతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
-
అంతిమ యాత్ర సాగిందిలా..
ఆర్మీ, పోలీసు జీపు భద్రతతో ట్రక్ హాజీ అలీ జంక్షన్, వర్లీ నాకా, పొద్దార్ హాస్పిటల్ చౌక్, పాత పాస్‌పోర్ట్ ఆఫీస్, సిద్ధివినాయక దేవాలయం, కేడల్ రోడ్డు మీదుగా దాదర్‌లోని శివాజీ పార్క్‌కు చేరుకుంది.
-
ఆర్మీ ట్రక్కులో లతా అంతిమయాత్ర
త్రివర్ణ పతాకం ధరించిన గాయని లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ఆదివారం సాయంత్రం దక్షిణ ముంబైలోని ఆమె నివాసం నుంచి దాదర్‌లోని శివాజీ పార్క్‌కు ఆర్మీ ట్రక్కులో తీసుకువచ్చారు. మంగేష్కర్ సోదరి ప్రముఖ గాయని ఆశా భోంస్లే, ఆమె కుటుంబ సభ్యులు కొందరు ట్రక్కులో మృతదేహంతో ఉన్నారు.
-
మరికాసేపట్లో ప్రధాని మోడీ
మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ శివాజీ పార్కుకు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ‘స్వర కోకిల’ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
-
అంతిమయాత్రలో గోవా సీఎం ప్రమోద్ సావంత్
ముంబైలో లతా మంగేష్కర్ అంతిమయాత్రలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. గోవాలో ఎన్నికల ప్రచారాన్ని కుదించి ముంబైకి వచ్చి నివాళులర్పించారు.
-
శివాజీ పార్క్ వద్దకు అంతిమయాత్ర
లతా మంగేష్కర్ భౌతికకాయం శివాజీ పార్క్‌కు చేరుకుంది, గాన కోకిలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి.
-
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా లతా
లతా దీదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ప్రతి విషయంలోనూ ఆమెకు భిన్నమైన అభిప్రాయం ఉండేది. ‘స్వర కోకిల’ లతా మంగేష్కర్ తన గాత్రంతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
-
ఇళయరాజా సంతాపం
లతా మరణం హృదయవిదారకంగా ఉందని స్వర మాంత్రికుడు ఇళయరాజా. ఆమెతో పనిచేసినందుకు సగర్వంగా ఉంది. ఈ అపురూపమైన స్వరాన్ని, ఆత్మను ఇష్టపడ్డాను.లతాజీకి మన హృదయాల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు. ఆమె తన స్వరంతో మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేశారు.
Heartbroken, but blessed to have known her & for having worked with her.. loved this incredible voice & soul… Lataji holds a place in our hearts that is irreplaceable…. That's how profoundly she has impacted our lives with her voice. pic.twitter.com/HEAWKaUTZs
— Ilaiyaraaja (@ilaiyaraaja) February 6, 2022
-
సంతాపం తెలిపిన సచిన్ టెండూల్కర్
“లతా దీదీ జీవితంలో భాగమైనందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె తన ప్రేమ, ఆశీర్వాదాలతో నన్ను ఎప్పుడూ ముంచెత్తింది. ఆమె మరణించడంతో, నాలో కొంత భాగం కూడా కోల్పోయినట్లుంది.” అని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
-
నివాళులర్పించిన గాయని చిత్ర
“నేడు భారతదేశం తన స్వరాన్ని కోల్పోయింది. తరతరాలుగా భారతీయ సంగీతాన్ని నిర్వచించిన స్వరం. లతాజీ తన ఆత్మీయ స్వరంతో దశాబ్దాలుగా మన జీవితాలను సుసంపన్నం చేసింది. ఆమె వారసత్వం అసమానమైనది. లతాజీ భౌతికంగా మనతో లేకపోయినా ఆమె గొంతు మన హృదయాల్లో నిలిచిపోతుంది. . మా సరస్వతికి ప్రణామం” అని గాయని కేఎస్ చిత్ర ట్వీట్ చేశారు.
-
‘సరస్వతీ దేవి స్వయంగా ఆశీర్వదించింది’
“లతాజీకి స్వయంగా సరస్వతీ దేవి అనుగ్రహం లభించింది. మనందరికీ తీరని లోటు.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని భాగ్యశ్రీ ట్వీట్ చేశారు.
-
అంతిమక్రియలకు 25 కిలోల గంధం దుంగలు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లోని బహిరంగ మైదానంలో జరగనున్నాయి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే స్మారకం నుండి 100 మీటర్ల దూరంలో దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌కు పశ్చిమం వైపున పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సామ్రాజ్ఞిని దహన సంస్కారాలు చేసే చేయనున్నారు. మంగేష్కర్ అంత్యక్రియల కోసం దాదాపు 25 కిలోల గంధంతో పాటు ఇతర సామగ్రిని ఏర్పాటు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు.
Mumbai | People join the funeral procession of #LataMangeshkar as it proceeds to Shivaji Park from her 'Prabhukunj' residence
The last rites of the legendary singer will be performed at Shivaji Park today evening pic.twitter.com/poVpSWNm2f
— ANI (@ANI) February 6, 2022
-
శివాజీ పార్క్‌లో ‘స్వర కోకిల’ అంత్యక్రియలు
భారతరత్న లతా మంగేష్కర్ పార్థివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శివాజీ పార్క్‌కు తరలించారు. లతా దీదీ చివరి యాత్రలో ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్‌లో ‘స్వర కోకిల’ అంత్యక్రియలు జరగనున్నాయి.
#WATCH मुंबई: भारत रत्न लता मंगेश्कर के पार्थिव शरीर को अंतिम संस्कार के लिए शिवाजी पार्क ले जाया जा रहा है। pic.twitter.com/vs28h2WP1K
— ANI_HindiNews (@AHindinews) February 6, 2022
-
కడసారి వీడ్కోలు
బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను కడసారి చూసేందుకు వస్తున్నారు. లతామంగేష్కర్ కు నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చారు.
-
నివాళ్లులర్పించిన టీమిండియా
సంగీత రాణి లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు సభ్యులు చేతికి నల్ల బ్యాడ్జీలను కట్టుకున్నారు.
-
బెంగాల్‌లో ఫిబ్రవరి 7న హాఫ్-డే సెలవు
స్వర కోకిల లతా మంగేష్కర్ గౌరవార్థం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపు ఫిబ్రవరి 7న హాఫ్-డే సెలవు దినంగా పాటించనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధృవీకరించారు.
-
లతాజీ లేని లోటు ఇంకెవరూ ఇప్పటికీ పూడ్చలేనిదిః ఏఆర్ రెహమాన్
ఇవాళ వెరీ వెరీ శాడ్ డే అన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్. లతాజీ లేని లోటు ఇంకెవరూ ఇప్పటికీ పూడ్చలేనిదన్నారు. లతాజీతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
-
ఒంటరి చేసి వెళ్లిపోతున్న లతా మంగేష్కర్
లతా మంగేష్కర్… పాటకు మరో రూపం. భారతీయ సినిమాకే కాదు… నేపథ్యగానానికే తలమానికం. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటూ యావత్ సంగీత ప్రపంచమే నెత్తిన పెట్టుకున్న అమరగానం. ఇప్పుడా స్వరం మూగబోయింది. గానాభిలాషుల్ని ఒంటరి చేసి వెళ్లిపోయింది.
-
నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి సంతాపం
స్వర కోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సంతాపం వ్యక్తం చేశారు.
Nepal President Bidya Devi Bhandari condoles Lata Mangeshkar's demise pic.twitter.com/2BgHzKBY66
— ANI (@ANI) February 6, 2022
-
రేపు ప్రభుత్వ సెలవు
భారతరత్న లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలుపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం రేపు (ఫిబ్రవరి 7) ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది.
-
ప్రభుత్వ లాంఛనాలతో లతా అంత్యక్రియలు
స్వరా నైటింగేల్ లతా ‘దీదీ’ మృతికి ఫిబ్రవరి 6 , 7 తేదీల్లో రెండు రోజుల కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఆదివారం, సోమవారాల్లో భారతదేశం అంతటా జాతీయ జెండాను సగం ఎగురవేస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో లతా అంత్యక్రియలు జరుగుతాయి.
-
గాత్రంతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారుః నవీన్ పట్నాయక్
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలుపారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తన మధురమైన గాత్రంతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. లతా మంగేష్కర్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డానని పట్నాయక్ ట్వీట్ చేశారు. ‘స్వర్ సామ్రాగి ఆఫ్ ఇండియా’ మన సామూహిక స్పృహలో శూన్యాన్ని మిగిల్చింది. తన మధురమైన సంగీతంతో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులకు అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
ఆమె పాటలు ఎవర్ గ్రీన్ః తేజస్వీ యాదవ్
లతా దీదీ మృతి పట్ల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. అవి దేశ వారసత్వమని, అవి ఎప్పటికీ మిస్సవుతాయన్నారు. అలాంటి వ్యక్తిత్వాలు శతాబ్దాలుగా, శతాబ్దాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె పాటలు ఎవర్ గ్రీన్ అని పేర్కొన్నారు.
-
స్వరాల రూపంలో ఆమె ఎప్పటికీ చిరంజీవులేః మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపారు. ఆమె జీవితం, ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. స్వరాల రూపంలో ఆమె పవిత్ర జ్ఞాపకం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మనస్సులో నిలిచిపోతుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ వీడియో ద్వారా విడుదల చేసిన తన సంతాప సందేశంలో, ‘భారతరత్న లతా మంగేష్కర్ మరణించడం వల్ల నాకే కాదు, ప్రతి భారతీయుడి మనస్సులో ఏర్పడిన వేదన, శూన్యతను మాటల్లో వర్ణించడం కష్టం.”ఎనిమిది దశాబ్దాలుగా తమ గాత్ర వర్షంతో భారతీయులను సంతృప్తిపరిచే ఆనంద సంపదను కోల్పోయాం’ అని ఆయన అన్నారు.
-
తరాల సంగీత ప్రియులకు ఆమె స్ఫూర్తిః అద్వానీ
లతా మంగేష్కర్ మరణం పట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ తీవ్ర సంతాపం తెలిపారు. మంగేష్కర్ స్వరంలో పాడిన రామ్ భజన 1990లో తన ‘రామ్ రథయాత్ర’లో “సిగ్నేచర్ ట్యూన్” అయ్యిందని అన్నారు. సంగీత ప్రపంచంలో మంగేష్కర్ చెరగని రాణించారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు ఆయనను రోల్ మోడల్‌గా భావిస్తున్నారని అన్నారు. దేశం ఆయనను నిజంగా మిస్ అవుతుందని అన్నారు. తరాల సంగీత ప్రియులకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారని అన్నారు.
-
ప్రారంభమైన అంతిమ యాత్ర
స్వర కోకిల లతా మంగేష్కర్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆమె పార్థీవదేహాన్ని అశేష అభిమానుల అశ్రునయనాల నడుమ శివాజీ పార్కుకు తరలిస్తున్నారు. లతాజీ తన చివరి ప్రయాణం కొనసాగుతోంది. లతాజీ మృతదేహాన్ని ఆర్మీ ట్రక్ ద్వారా శివాజీ పార్కుకు తరలిస్తున్నారు.
-
లతా అంత్యక్రియలకు ప్రధాని
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. సాయంత్రం 5:45 – 6:00 గంటలకు శివాజీ పార్క్ మైదానానికి చేరుకుంటారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. 6:15-6 గంటలకు లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు.
Published On - Feb 06,2022 4:04 PM