Lata Mangeshkar: అత్యంత మధురమైన గాత్రం లోకాన్ని వీడడం చాలా బాధాకరం: ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్

Lata Mangeshkar: దేశం గర్వించతగ్గ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మరణ వార్త విన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లతా ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు..

Lata Mangeshkar: అత్యంత మధురమైన గాత్రం లోకాన్ని వీడడం చాలా బాధాకరం: ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
Lata Mangeshkar
Follow us
Venkata Chari

|

Updated on: Feb 06, 2022 | 3:30 PM

Lata Mangeshkar: దేశం గర్వించతగ్గ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మరణ వార్త విన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లతా ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లతా(Lata Mangeshkar) ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్‌ మరణ వార్త తెలియగానే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్(MP Santosh Kumar) కూడా తన సంతాపాన్ని ప్రకటించారు.

ట్విట్టర్ వేదికగా లతా మంగేష్కర్‌ సేవలను గుర్తు చేస్తూ ఎంపీ సంతోష్ కుమార్ ఎమోషనల్‌ అయ్యారు. చిన్నప్పటి ఫోటోను షేర్‌ చేసిన సంతోష్ కుమార్.. ‘అత్యంత మధురమైన లతా మంగేష్కర్‌ మరణించారనే వార్త చాలా బాధాకరం. ఆమె ఆత్మకు భగవంతుని నివాసంలో సాంత్వన కలుగుతుంది’ అంటూ రాసుకొచ్చారు ఎంపీ సంతోష్ కుమార్.

ఇదిలా ఉంటే లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి నుంచి ఆమె స్వగృహానికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌కు తరలిస్తారు. ఇక అంత్యక్రియలు సాయంత్రం 6 గంటల తర్వాత జరగనున్నాయి.

Also Read: Lata Mangeshkar: మాటల్లో చెప్పలేనంత వేదనగా ఉంది.. లతా మంగేష్కర్‌ మరణంపై మోదీ ట్వీట్‌..

Nehru-Lata Mangeshkar: ప్రధాని నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్‌ పాట