AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalu Prasad Yadav: ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్.. ప్రస్తుతం ఎయిమ్స్‌లోనే బీహార్‌ నేత..

Lalu Prasad Yadav Gets Bail: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. పశువుల దాణా కుంభకోణంలో భాగమైన దుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్​యాదవ్‌

Lalu Prasad Yadav: ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్.. ప్రస్తుతం ఎయిమ్స్‌లోనే బీహార్‌ నేత..
Lalu Prasad Yadav
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2021 | 1:59 PM

Share

Lalu Prasad Yadav Gets Bail: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. పశువుల దాణా కుంభకోణంలో భాగమైన దుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్​యాదవ్‌కు​ బెయిల్‌ ఇచ్చేందుకు ఇటీవల హైకోర్టు పలుమార్లు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పశువుల దాణా కుంభకోణం కేసుకు సంబంధించి నాలుగు కేసులకు గానూ.. లాలూ ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్​పొందారు. అయితే.. డుమ్కా ట్రెజరీ కేసులోనూ బెయిల్​వస్తుందని బీహార్ ఎన్నికలకు ముందు అందరూ భావించారు. కానీ.. ధర్మాసనం ఇందుకు నిరాకరిస్తూ వచ్చింది. శిక్షకాలం కూడా దగ్గరపడుతుండటంతో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కోర్టు నుంచి బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో లాలూ ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఇంటికి చేరుకోనున్నారు.

అయితే.. లాలూ 1990-96లో బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుశుగ్రాసం కుంభకోణం దీంతోపాటు డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమ ఉపసంహరణకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూను 2017లో జైలుకు పంపింది. ఇందుకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతుండగా.. పశుగ్రాసం కేసులో బెయిల్ లభించింది. కానీ.. డుమ్కా కేసులో లభించలేదు. ఇటీవల లాలూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా.. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే జైలు శిక్షలో అత్యధిక భాగం లాలూ ఆసుపత్రిలోనే ఉన్నారు.

కాగా.. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పటి నుంచి ఆయన కుమారుడు తేజశ్వి యాదవ్ రాష్ట్ర జనతాదళ్ (ఆర్జేడీ) కి నాయకత్వం వహిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో లాలూ మొదటిసారి ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, యూడీయూ కూటమి గెలిచిన విషయం తెలిసిందే.

Also Read:

Kumbh Mela:  హరిద్వార్ కుంభమేళాలో కరోనా పంజా.. స్పందించిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే..