Kumbh Mela:  హరిద్వార్ కుంభమేళాలో కరోనా పంజా.. స్పందించిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే..

కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోంది. ఈ సమయంలో కరోనాను కట్టడి చేయాలంటే తలకు మించిన భారంగా మారింది ప్రభుత్వాలకు. ఈ నేపధ్యంలో ఒక పక్క ఎన్నికలు.. మరోపక్క పండగలు.. ప్రజలు ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

  • KVD Varma
  • Publish Date - 1:21 pm, Sat, 17 April 21
Kumbh Mela:  హరిద్వార్ కుంభమేళాలో కరోనా పంజా.. స్పందించిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే..
Pm Modi

Kumbh Mela:  కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోంది. ఈ సమయంలో కరోనాను కట్టడి చేయాలంటే తలకు మించిన భారంగా మారింది ప్రభుత్వాలకు. ఈ నేపధ్యంలో ఒక పక్క ఎన్నికలు.. మరోపక్క పండగలు.. ప్రజలు ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కరోనా వైరస్ గుంపులుగా ఉన్న జనాన్ని చూస్తె అసలు ఆగే పరిస్థితి లేదు. తాజాగా హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా కరోనాకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఎక్కువగా జనం ఒకేదగ్గర చేరడం. కరోనా నిబంధనలు అందరూ పాటించే అవకాశం లేకపోవడంతో ఇక్కడ కరోనా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతోంది. దీనిని కట్టడి చేయడం కోసం కుంభమేళాను నిలిపివేయాలని పలువురు కోరుతూ వస్తున్నారు. ఈ కుంభమేళా నిర్వహణపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులేకుండా వ్యాపిస్తున్నందున కుంభమేళాను పరిమితంగా నిర్వహించుకోవాలని సాధువులను ఆయన కోరారు. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో చాలా మందికి కరోనా సోకినా విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ జునా అఖడాహెడ్ స్వామి అవధేశానంద్ గిరితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. సాధువుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్న ప్రధాని వారికి ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలనూ అందిస్తుందని తెలిపారు. కుంభమేళాను కుదించాలని అయన స్వామిని కోరారు.

‘‘రెండు షాహీ స్నాన్‌(రాజ స్నానాలు) పూర్తయ్యాయి కనుక ఇప్పుడున్న కరోనా సంకట పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా(భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించడం) జరపాలని స్వామి అవధేశానంద్‌ గిరిని ప్రార్థించాను. ఈ నిర్ణయం మహమ్మారిపై పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది’’అని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో నిత్యం లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇటీవల ఏప్రిల్‌ 12, 14 రోజుల్లో జరిగిన షాహీ స్నాన్‌లలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కుంభమేళాను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులతో పాటు పలు అఖాడాలకు చెందిన సాధువులు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో కొన్ని అఖాడాలు స్వచ్ఛందంగా హరిద్వార్‌ను వీడేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి కుంభమేళా మూడు నుంచి నాలుగు నెలలు జరుగుతుంది. కానీ, కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో దీనిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకూ అంటే నెల మాత్రమే జరపాలని ననిర్ణయించారు. అయితే, కరోనా ఉధృతి పెరిగిపోతుండటంతో ఈలోపుగానీ దీనిని ముగించాలని భావిస్తున్నారు. ప్రధాని కూడా అదే విషయాన్ని సాధువులకు చెబుతున్నారు.

కుంభమేళా పై ప్రధాని మోడీ ట్వీట్..

Also Read: Running: రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణీకుల పరుగో పరుగు.. ఆందోళనలో అధికారులు..ఎందుకంటే..?

మానవత్వం ఎక్కడా..? అని ఎవరైనా అడిగితే ఈ స్టోరీ చూపించండి.. ఈ మహిళకు వేల వేల వందనాలు