Lalu Yadav Kidney Transplant: అందుకే కంటే కూతురునే కనాలి అంటారు.. లాలూకు కిడ్నీ దానం చేయనున్న..

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో కిడ్నీ మార్పిడి చేయించుకోనున్నారు. లాలూకు కిడ్నీ దానం చేసేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు.

Lalu Yadav Kidney Transplant: అందుకే కంటే కూతురునే కనాలి అంటారు.. లాలూకు కిడ్నీ దానం చేయనున్న..
Lalu Yadav

Edited By: Anil kumar poka

Updated on: Nov 10, 2022 | 3:09 PM

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో కిడ్నీ మార్పిడి చేయించుకోనున్నారు. లాలూకు  కిడ్నీ దానం చేసేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు. కిడ్నీ, ఇతర  సమస్యతో గత కొన్నేళ్లుగా బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు లాలూ ప్రసాద్. సింగపూర్‌లో ఉంటున్న ఆయన కుమార్తె రోహిణి తండ్రి ఆరోగ్యంపై ఆందోళన చెందారు. లాలూను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రికి అక్టోబర్ మాసంలో తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు చేసిన డాక్టర్ల బృందం..  కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని సూచించారు.

లాలూ ప్రసాద్ యాదవ్‌కు రోహిణి ఆచార్య  లాలూకు తన ఓ కిడ్నీని దానం చేసి ప్రాణభిక్షపెట్టేందుకు ముందుకు వచ్చారు.  రోహిణి సింగపూర్‌లో ఉండడంతో ఈ నెల 20-24 తేదీల మధ్యలో లాలూ అక్కడకు వెళ్లనున్నారు. కూతురు తనకు కిడ్నీ దానం చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఆయన నిరాకరించారని.. ఆ తర్వాత రోహిణి ఒత్తిడి చేయడంతో లాలూ ఒప్పుకున్నారని సమాచారం. సక్సస్ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో కిడ్నీ మార్పిడికి లాలూ అంగీకరించారు. నవంబరు నెలాఖరులో సింగపూర్ ఆసుపత్రిలో లాలూకు కిడ్నీ మార్పిడికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

లాలూ ప్రయాద్ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసేందుకు ఆయన కుమార్తె ముందుకు రావడం పట్ల ఆర్డేడీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి