IND vs ENG, T20 Semi Final Highlights: సెమీస్‌లో రోహిత్ సేనకు ఘోర పరాభవం.. ఫైనల్ చేరిన ఇంగ్లండ్..
IND vs ENG T20 World Cup 2022 Semi Final Match Highlights: ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంటుంది.
IND vs ENG T20 World Cup, Semi Final 2022 Highlights: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా ఫైనల్‌కు చేరలేదు. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఈ లక్ష్యాన్ని 16వ ఓవర్లో 10 రన్ రేట్‌తో సాధించి, టీమిండియాకు కన్నీళ్లే మిగిల్చారు.
భారత్ ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్
LIVE Cricket Score & Updates
-
IND vs ENG: పాక్ ఢీకొట్టేది ఇంగ్లాండే.. ఓడిన భారత్..
టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా ఫైనల్‌కు చేరలేదు. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఈ లక్ష్యాన్ని 16వ ఓవర్లో 10 రన్ రేట్‌తో సాధించి, టీమిండియాకు కన్నీళ్లే మిగిల్చారు.
-
11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
11 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ టీం వికెట్ కోల్పోకుండా 108 పరుగులు చేుసింది. ఓపెనర్లు హేల్స్ 66, జోస్ బట్లర్ 38 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లను దంచికొట్టి, 10 రన్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు.
-
-
6 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ టీం వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేుసింది. ఓపెనర్లు హేల్స్ 33, జోస్ బట్లర్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి అద్భుత భాగస్వామ్యంతో పవర్ ప్లేలో భారత బౌలర్లను దంచికొట్టి, 10 రన్ రేట్‌తో పరుగులు సాధించారు.
-
4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ టీం వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేుసింది. ఓపెనర్లు హేల్స్ 15, జోస్ బట్లర్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
IND vs ENG: ఇంగ్లండ్ టార్గెట్ 169
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ అడిలైడ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ మాత్రమే రాణించాడు. అతను 50 పరుగులు చేశాడు. హార్దిక్‌తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హార్దిక్ కూడా అద్భుతంగా ఆడి, అర్ధశతకం పూర్తి చేశాడు.
-
-
కోహ్లీ ఔట్..
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లీ(50 పరుగులు, 40 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. దీంతో 136 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్‌ను కోల్పోయింది.
-
17 ఓవర్లకు స్కోర్..
17 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. విరాట్ 48, పాండ్యా 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య 34 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
-
15 ఓవర్లకు స్కోర్..
15 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. విరాట్ 43, పాండ్యా 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మూడో వికెట్ డౌన్..
అనుకున్నట్టుగానే ఇంగ్లండ్ టీం సక్సెస్ అయింది. సూర్య కోసం పక్కా ప్లాన్ వేసినట్టుగానే సూర్యకుమార్‌ను పెవిలియన్ చేర్చారు. దీంతో సూర్య 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయిన భారత్ 75 పరుగులు చేసింది.
-
రెండో వికెట్ డౌన్..
కీలక భాగస్వామ్యం దిశగా సాగుతోన్న దశలో రోహిత్ శర్మ (27 పరుగులు, 28 బంతులు, 4 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. దీంతో 56 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
-
50 పరుగులకు చేరిన స్కోర్..
8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది. రోహిత్ 23, విరాట్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాహుల్ ఔట్ తర్వాత వీరిద్దరు కీలక భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో స్కోర్ను 50 పరుగులు దాటించారు.
-
IND vs ENG: పవర్ ప్లేలో టీమిండియా స్కోర్..
పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. రోహిత్ 20, విరాట్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మళ్లీ నిరాశ పర్చిన రాహుల్..
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ నిరాశపర్చాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 5 పరుగులే చేసి వోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 1.4 ఓవర్లు ముగిసే సరికి 9/1.
-
మొదటి బంతికే ఫోర్ కొట్టిన కెప్టెన్..
టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైంది. బెన్‌స్టోక్స్ వేసిన మొదటి బంతినే బౌండరీకి తరలించి ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు కెప్టెన్ రోహిత్. మొదటి ఓవర్ ముగిసే సరికి భారత జట్టు ఆరు పరుగులు చేసింది.
-
భారత్ ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
-
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ -
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్..
కీలక మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సేన బ్యాటింగ్ చేయనుంది.
-
IND vs ENG: భారత్ అభిమానుల నిరీక్షణకు తెరపడుతుందా..
ఐసీసీ టోర్నీల్లో గత కొన్నేళ్ల చరిత్ర కూడా భారత్‌కు అనుకూలంగా లేదు. 2013 నుంచి భారత జట్టు చివరి రెండు దశల అడ్డంకిని దాటలేకపోయింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌లోనూ, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌లోనూ ఓడిపోయింది. ఈసారి జట్టు మంచి స్థితిలో ఉండడంతో ఐసీసీ ట్రోఫీ కోసం అభిమానుల నిరీక్షణకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-
IND vs ENG: విరాట్, రోహిత్ గాయపడ్డారు..
మంగళవారం ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. బుధవారం స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ సమయంలో గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, ఇద్దరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారు.
-
IND vs ENG: ఇంగ్లండ్‌కు భారీ దెబ్బ..
సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుకు చాలా కీలకం. అయితే, జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్ మార్క్ వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. ఇది టీమ్ ఇండియాకు పెద్ద రిలీఫ్. ప్రపంచకప్‌లో ఈ బౌలర్ ప్రత్యర్థి జట్లను చాలా ఇబ్బంది పెట్టాడు.
-
IND vs ENG: హెడ్ టు హెడ్ రికార్డ్స్..
ఈ రెండు జట్లను ప్రస్తుతానికి రెండు పటిష్టమైన జట్లుగా పరిగణిస్తున్నందున భారత్-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇరు జట్ల బ్యాటింగ్ చాలా బాగుంది.
-
IND vs ENG: ఇంగ్లండ్‌తో భారత్ హోరాహోరీ పోరు..
ఈరోజు జరిగే సెమీస్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇరు జట్ల చూపు ఫైనల్ టిక్కెట్‌పైనే ఉంటుంది. టోర్నీ చివరి మ్యాచ్ ఆదివారం మెల్‌బోర్న్‌లో జరగనుంది. పాకిస్థాన్ ఇప్పటికే ఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది.
Published On - Nov 10,2022 12:26 PM