కూలీకి జాక్‌పాట్‌.. 35లక్షలు విలువ చేసే వజ్రాలు లభ్యం

గురువారం రోజు ఆ కూలీ ఏ ముహూర్తాన లేచాడో తెలీదు కానీ.. జాక్‌పాట్‌ కొట్టేశాడు. వజ్రాల వేటలో అతడికి దాదాపు రూ.35లక్షలు విలువ చేసే మూడు వజ్రాలు దొరికాయి.

కూలీకి జాక్‌పాట్‌.. 35లక్షలు విలువ చేసే వజ్రాలు లభ్యం

Labourer Finds Diamonds: గురువారం రోజు ఆ కూలీ ఏ ముహూర్తాన లేచాడో తెలీదు కానీ.. జాక్‌పాట్‌ కొట్టేశాడు. వజ్రాల వేటలో అతడికి దాదాపు రూ.35లక్షలు విలువ చేసే మూడు వజ్రాలు దొరికాయి. దీంతో అతడి జీవితమే మారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుబాల్‌ అనే వ్యక్తి పన్నా ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకుతుండగా.. 7.5 క్యారట్‌ల విలువైన వజ్రాలు దొరికాయి. వాటి విలువ రూ. 35 లక్షల వరకూ ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. ట్యాక్స్‌లు పోను అతడికి మార్కెట్‌ విలువలో 88 శాతం దక్కుతుందని వారు పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సుబాల్‌ ఆ వజ్రాలను ప్రభుత్వానికి ఇచ్చాడని, దాన్ని వేలం వేసిన తరువాత వచ్చిన డబ్బును అతడికి ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా బుందేల్‌ఖండ్‌లోని పన్నా ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధిచెందింది. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తికి 10.69 క్యారట్ల విలువైన వజ్రం దొరికింది.

Read This Story Also: ఏపీ ప్రభుత్వ సంస్కరణలకు.. 15 ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు..!

Click on your DTH Provider to Add TV9 Telugu