ఏపీ ప్రభుత్వ సంస్కరణలకు.. 15 ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు..!

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏకంగా 15

ఏపీ ప్రభుత్వ సంస్కరణలకు.. 15 ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు..!
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 12:57 PM

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏకంగా 15 పురస్కారాలు దక్కాయి. ఏటా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికిగానూ రాష్ట్రానికి ఈ పురస్కారాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

మెరుగైన సంస్కరణలు చేపట్టినందుకు ఈ–పంచాయత్‌ పురస్కార్‌ కేటగిరి–ఐఐ(ఎ)లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాకు సాధారణ కేటగిరిలో జిల్లాస్థాయి పురస్కారం లభించింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం, గుంటూరు జిల్లా మేడికొండూరు, చిత్తూరు జిల్లా రామచంద్రాపురం, వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులకు జనరల్‌ కేటగిరిలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ శశక్తికరణ్‌ పురస్కారాలు లభించాయి. విజయనగరం జిల్లా బొందపల్లె మండలంలోని కొండకింద, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీలకు ధిమాటిక్‌ కేటగిరీలో పురస్కారాలు దక్కాయి.

సాధారణ కేటగిరిలో తూర్పు గోదావారి జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరు, ప్రకాశం జిల్లా కురిచేడు, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కట్టేవరం గ్రామ పంచాయతీలు పురస్కారాలు సాధించుకున్నాయి. గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడంలో విజయనగరం జిల్లాలోని బొండపల్లి, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం కింద తూ.గో. జిల్లాలోని చెల్లూరు, చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయత్‌ అవార్డు కింద తూర్పు గోదావారి జిల్లాలోని మూలస్థానంకు అవార్డులు దక్కాయి.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం