‘వ్యాక్సిన్‌’ పాలసీ సిద్ధం చేయండి.. కేంద్రానికి కేటీఆర్‌ లేఖ..!

‘వ్యాక్సిన్‌’ పాలసీ సిద్ధం చేయండి.. కేంద్రానికి కేటీఆర్‌ లేఖ..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశమున్నందున అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ‘వ్యాక్సిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ’ని

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 07, 2020 | 1:21 PM

Formulate guidelines on licensing Coronavirus vaccine: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశమున్నందున అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ‘వ్యాక్సిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ’ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. వ్యాక్సిన్‌ తయారీ సంస్థకు పీఎం కేర్స్‌ నుంచి రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు, వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్‌ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు.

దీనికి సంబంధించి సెంట్రల్ హెల్త్ మినిష్టర్ హర్షవర్ధన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. ‘ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని గా ఉన్న హైదరాబాద్‌ ఏటా 5 బిలియన్‌ డోసులు తయారీ ద్వారా ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ల తయారీ కోసం ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలతోపాటు, రాష్ట్ర స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. అనుమతులు, క్లియరెన్సుల కోసం నిబంధనలు సరళతరం చేస్తూ కొత్త విధానం రూపొందించాలని కేటీఆర్‌ సూచించారు.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu