AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కిషన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే.?

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇదే రోజు సరిగ్గా 50 ఏళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు ఓ సంచలన తీర్పు ప్రకటించిందని.. ఆ తీర్పుతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లోక్‌సభకు అనర్హురాలు అని తెల్చిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి ఎన్నికను క్షుణ్ణంగా..

Kishan Reddy: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కిషన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే.?
Kishan Reddy
Ravi Kiran
|

Updated on: Jun 12, 2025 | 3:57 PM

Share

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇదే రోజు సరిగ్గా 50 ఏళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు ఓ సంచలన తీర్పు ప్రకటించిందని.. ఆ తీర్పుతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లోక్‌సభకు అనర్హురాలు అని తెల్చిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి ఎన్నికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పక్కనపెట్టిన ఏకైక కేసు ఇదంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరి ఆ ట్వీట్ ఏంటంటే.?

‘సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, జూన్ 12, 1975న అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఆ తీర్పు ప్రకారం.. శ్రీమతి ఇందిరా నెహ్రూ గాంధీ, ప్రతివాది నెంబర్ 1, లోక్‌సభకు ఎన్నిక చెల్లదని ప్రకటించింది. తదనుగుణంగా ఆమెను ఆరు సంవత్సరాల పాటు అనర్హురాలిగా తేల్చింది. స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి ఎన్నికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పక్కనపెట్టిన ఏకైక కేసు ఇది. కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీలో ఫాసిస్ట్, నియంతృత్వ ప్రేరణలు మరింతగా పెరగడానికి దారితీసింది. దీని ఫలితంగా రెండు వారాల తర్వాత అత్యవసర పరిస్థితి విధించబడింది. అప్పటి నుంచి భారతదేశం ముందుకు సాగి తన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంది. అయితే, అధికారంలో ఉన్నవారు గతంలో చేసిన పాపాలను గుర్తుంచుకోవాలి. తద్వారా అత్యవసర పరిస్థితిని అమలు చేసిన వారిని వారి పనులకు జవాబుదారీగా ఉంచాలి’ అని కిషన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.