AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lohgarh Murder: కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై రూ.10కోట్ల డిఫర్‌మేషన్!

అసలు సియా గోయల్ లాయర్ ఎవరు? ఆమె తరపున వాదిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నే ఇప్పుడు లోహ్‌గడ్ మర్డర్ కేసును కొత్త మలుపు తిప్పింది. ఈ కేసు వాదించేది తామంటే తామని అషుతోష్ శ్రీవాస్తవ్, విపుల్ దుషింగ్ అనే ఇద్దరు లాయర్లు చెప్పడంతో.. ఇంతకూ ఈ కేసును వాదించే లాయర్ ఎవరనే ప్రశ్న తలెత్తింది.

Lohgarh Murder: కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై రూ.10కోట్ల డిఫర్‌మేషన్!
Lohgarh Murder Case
Anand T
|

Updated on: Jul 01, 2026 | 3:51 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోహ్‌గడ్ మర్డర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న సియా గోయల్‌ తరపున కోర్టులో వాదించే లాయర్ ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ కేసులో సియా తరపున తామంటే తామే వాదిస్తున్నామంటూ ఇద్దరు లాయర్లు చెప్పడంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగింది?

నిజానికి ఈ కేసును ముందు నుంచి తానే లీడ్ చేస్తున్నానని అషుతోష్ శ్రీవాస్తవ్ మీడియా ముందు మాట్లాడారు. అంతేకాదు, ఈ కేసును తనకే అప్పగిస్తున్నట్టు సియా గోయల్ స్వయంగా అన్ని లీగల్ డాక్యుమెంట్లపై సంతకం చేసి, తనకు లీగల్ అథారిటీ ఇచ్చిందని ఆయన తెలిపారు. హైకోర్టులో కూడా ఆమె తరపున వాదించేది తానేనని చెప్పుకొచ్చారు. అయితే, ఇలా అషుతోష్ మాట్లాడిన మరుసటి రోజే అడ్వకేట్ విపుల్ దుషింగ్ రంగంలోకి దిగారు. సియా గోయల్ తరపున కేసు వాదించేది తామేనని, అందుకు వాళ్ల ఫ్యామిలీనే తనను నియమించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అసలు ఈ కేసును ఎవరు వాదిస్తున్నారనే పెద్ద కన్ఫ్యూజన్ జనాల్లో మొదలైంది.

ఇవి కూడా చదవండి

సియా సోదరుడికి అషుతోష్ నోటీసులు

తాజాగా ఈ వివాదానికి తెరదించుతూ సియా సోదరుడు సాహిల్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు అషుతోష్ ఎవరో తమకు తెలియదని, తాము అతన్ని నియమించుకోలేదని తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అడ్వకేట్ అషుతోష్‌ శ్రీవాస్తవ్.. సాహిల్ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అలాగే తన గౌరవానికి భంగం కలిగించాడని ఆరోపిస్తూ సాహిల్ గోయల్‌కు రూ. 10 కోట్ల డెఫమేషన్ నోటీసు పంపారు. సాహిల్ వెంటనే బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.

అలాగే తమకు, సాహిల్‌కు ఎలాంటి సంబంధం లేదని, తమను నేరుగా సియానే నియమించుకుందని అషుతోష్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆమె లాయర్‌ను మార్చాలి అనుకుంటే చట్టపరంగా ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) ఇవ్వాల్సి ఉంటుందని అషుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దీంతో ఇంతకూ సియా కేసును వాదిస్తున్న లాయర్ ఎవరనే సస్పెన్స్ ప్రజల్లో ఇంకా కొనసాగుతోంది.

ఈ కేసుకు సంబంధించి మరిని విషయాలు ఈ వీడియోలో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ