వరుస అవకాశాలతో దూసుకుపోతున్న పాయల్ రాధాకృష్ణ 

01 July  2026

Pic credit - Instagram

Rajeev 

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ అయ్యింది అందాల భామ పాయల్ రాధాకృష్ణ. తన అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఈ అమ్మడు కన్నడ సినిమాలతో పాటు తమిళం, తెలుగులో నటిస్తూ పేరుతెచ్చుకుంది. పి.ఎన్ దర్శకత్వం వహించిన 2017 కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్‌తో ఆమె అరంగేట్రం చేసింది.

ఆతర్వాత భిన్నా (2019) లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. 

ఇక పాయల్ రాధాకృష్ణ తెలుగులో తరగతి గది దాటి అనే వెబ్‌సిరీస్‌తో పరిచయం అయ్యింది. ఈ సిరీస్  ఆహా ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

ఆతర్వాత అలా నిన్ను చేరి , ప్ర‌స‌న్న‌వ‌ద‌నం, సత్యభామ,నీలి మేఘ శ్యామ, చౌర్య పాఠం, పాపం ప్రతాప్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాలు చేసింది. 

ఈ సినిమాల్లో పాపం ప్రతాప్ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు పాయల్ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. 

ఇక ఇప్పుడు హ్యాపీ జర్నీ అనే సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. ఇలా తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది పాయల్.