Shocking News: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. కొండచిలువను చంపి.. దాని మాంసంతో ఏం చేశారంటే!
కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొండచిలువను వేటాడి దాన్ని చంపి, ఆ తర్వాత దాని మాంసంతో వంట చేశారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి కొండచిలువ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

సాధారణంగా ఎవరైనా అడవి పందులు, లేదా ఇతర వేరే జంతువులను వేటినైనా వేటాడి వాటి మాంసాన్ని తినాలని చూస్తారు. కానీ ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు దేన్ని వేటాడారో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఎందుకంటే వాళ్లు వేటాడింది ఒక కొండచిలువను. కొండచిలువను వాళ్లు చేస్తారు అనుకున్నారా?. వేటాడిన కొండచిలువను చంపేసి. దాన్ని నీటుగా శుభ్రంచేసి ఏకంగా దాని మాంసంతో వంట చేశారు. స్థానికుల సమాచారంతో వాళ్లున్నప్రదేశంపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కొండచిలువ శరీరభాగాలను, వంటచేసి మాంసాన్నిస్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన కేరళలోని పనపుళ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రమోద్, బినీష్ అనే ఇద్దరు వ్యక్తులు బుధవారం సాయంత్రం తమ ఇళ్లకు సమీపంలోని రబ్బరు తోట నుండి ఒక పెద్ద కొండచిలువను వేటాడారని, ఆ తర్వాత వారు ఆ సరీసృపాన్ని చంపేసి దాని నివాసంలో కూర వండారని స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది.
ఇది కూడ చదవండి: మీ వయస్సును బట్టి.. మీరు ఎంత సేపు నిద్రపోవాలో ఇక్కడ తెలుసుకోండి!
పక్కా సమాచారం మేరకు తాలిపరంబా రేంజ్ ఆఫీసర్ సురేష్, అతని బృందం ఆ ఇంటిపై దాడి చేసి, పాము భాగాలను, వండిన వంటకాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమోద్, బినీష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు, తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: వామ్మో ఆలా పీక్కుతిన్నాయేంట్రా బాబు.. జూలో సింహాలు వద్దకు వచ్చిన సఫారీ వాహనం.. షాకింగ్ వీడియో
మరిన్ని ట్రెండింగ్ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
