AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఆలా పీక్కుతిన్నాయేంట్రా బాబు.. జూలో సింహాలు వద్దకు వచ్చిన సఫారీ వాహనం.. షాకింగ్‌ వీడియో

క్రూర జంతువులు మనతో ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ మనం వాటితో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని సార్లు అవి మనపైనే దాడి చేయగలవు. తాజాగా బ్యాంకాక్‌లో ఒక జూలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. బ్యాంకాక్ ఓపెన్ ఎయిర్ జూలో గత 20 ఏళ్ల పనిచేస్తున్న ఒక జూ కీపర్‌పై సింహాలు దాడి చేసి అతన్ని పీక్కు తిన్నాయి. ఈ ఘటన స్థానిక పర్యాటలకు భయాందోళనకు గురిచేసింది.

వామ్మో ఆలా పీక్కుతిన్నాయేంట్రా బాబు.. జూలో సింహాలు వద్దకు వచ్చిన సఫారీ వాహనం.. షాకింగ్‌ వీడియో
Lions Maul Zookeeper
Anand T
|

Updated on: Sep 11, 2025 | 6:31 PM

Share

జూకీపర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని జూలో ఉన్న సింహాలు దాడి చేసి పీక్కు తిన్న ఘటన బ్యాంకాక్ ఓపెన్ ఎయిర్ జూలో వెలుగు చూసింది. జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా ఈ జూలో పనిచేస్తున్నాడు. ఇతను రోజూ జంతువుల ఆహారం పెడుతూ వాటి బాగోగులు చూసుకునేవాడు. కానీ ఇటీవల పర్యాటకులతో కలిసి అతని సఫారి వాహనంలో సింహాల వద్దకు వెళ్లినప్పుడు అక్కడున్న సింహాలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. అతని శరీర భాగాలను కొంతవరకు పీక్కు తిన్నాయి.

ఇటీవల జూలో విధుల్లో ఉన్న ఖరాసమీ జూకు వచ్చిన పర్యాటకులను సఫారీ వాహనంలో తిప్పుతూ జూ గురించి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఆ వాహనాన్ని సింహాలు ఉన్న వైపునకు తీసుకెళ్లాడు. అప్పుడు వాటిని చూపించేందుకు అతని వాహనంలోంచి కిందకు దిగాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన ఒక సింహం అతడిపై దాడికి పాల్పడింది. అది చూసి మగతా సింహాలు కూడా అక్కడికి వచ్చి అతడిపై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాయి.

అయితే ఆ సమయంలో పర్యాటకులు వాహనంలోనే ఉన్నప్పటికీ సింహాలను చూసి భయపడిపోయి. కిందకు దిగే ధైర్యం చేయలేకపోయారు. కానీ వాహనం హారన్‌ కొట్టి సింహాలను అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించారు. అయినా ఆ సింహాలు అక్కడి నుంచి వెళ్లలేదు. అతడిపై ఇంకా దాడి చేస్తూనే ఉన్నాయి. దాదాపు 15 నిమిషాలకు వరకు అతని శరీరభాగాలను పీక్కు తిన్న తర్వాత అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

ఇవి కూడా చదవండి

సింహాల దాడిలో తీవ్రంగా గాయపడిన జూకీపర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు జూకీపర్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యాజమాన్యం. అతడి ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.