Tech Tips: వాట్సాప్ నుంచి కూడా క్షణాల్లో ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా?
ఆధార్ కార్డును పొందాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఆధార్ సెంటర్ వెళ్లి తెచ్చుకోవడం లేదా UIDAI వెబ్‌సైట్ నుంచి ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం. ఇవేవి కాకుండా ఉన్నదగ్గరి నుంచే మీరు మీ వాట్సాప్‌నే ఈజీగా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు అంటే మీరు నమ్ముతారా? అవును వాట్సాప్ ద్వారా కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అదెలానో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆధార్ ఒక ముఖ్యమైన దృవపత్రం. మనం ఎక్కడి వాళ్లం, మనం ఎవరని గుర్తించేందుకు ఆధార్ కచ్చితంగా కావాల్సిందే. అలాగే అన్ని ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సేవలలో ఆధార్ ప్రముఖంగా ఉపయోగించబడుతుంది. చాలా సార్లు మనం ఇంట్లో లేనప్పుడు అకస్మాత్తుగా ఆధార్ అవసరం అవుతుంది. చాలా మంది తమ మొబైల్‌లో ఆధార్ ఫోటోను ఉంచుకుంటారు. కానీ మీ దగ్గర అది లేకపోతే, అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆధార్ కార్డును వాట్సాప్ నుండి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి
వాట్సాప్ నుండి ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
మీరు వాట్సాప్ నుండి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, దానికి ముందు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు ప్రభుత్వ డిజిలాకర్‌లో మీ ఖాతాను క్రియేట్ చేయాలి. మీకు ఖాతా ఉంటే మంచిది, లేకపోతే మీరు డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్ సహాయంతో మీరు కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ప్రజలు తమ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి UIDAI వెబ్‌సైట్‌ను సందర్శిస్తారు లేదా mAadhaar యాప్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది DigiLocker ను కూడా ఉపయోగిస్తారు. ఇవి రెండు కాదనుకున్నప్పుడు మీకు WhatsApp మూడవ ఎంపిక కావచ్చు.
వాట్సాప్ నుండి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా మీ ఫోన్‌లో +91-9013151515 మొబైల్ నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఇది MyGov హెల్ప్‌డెస్క్ అధికారిక వాట్సాప్ నంబర్, ఇది వాట్సాప్ నుండి ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
ఈ దశలవారీ ప్రక్రియను అనుసరించండి.
- ఈ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసిన తర్వాత, ఆ నంబర్‌నుతో చాట్ ఓపెన్ చేయండి
- ఆ తర్వాత ఆ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయండి
- అప్పుడు చాటాబాట్ నుంచి కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో అనేక ఎంపికలు కనిపిస్తాయి
- ఆ ఎంపికల నుండి, మీరు డిజిలాకర్ సేవలను ఎంచుకోవాలి
- మీరు డిజిలాకర్‌లో ఇప్పటికే అకౌంట్ సృష్టించినందున, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి.
- మీ నంబర్‌కు OTP వస్తుంది, దానిని చాట్‌లో టైప్ చేయండి.
- ఇది ధృవీకరణ ప్రక్రియ, పూర్తయిన తర్వాత మీకు డిజిలాకర్‌లోని అన్ని పత్రాలు కనిపిస్తాయి.
- జాబితా నుండి ఆధార్‌ను ఎంచుకోండి. కొంత సమయం తర్వాత మీ ఆధార్ కార్డ్ వాట్సాప్‌లో కనిపిస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్టిక్ చేయండి.




