AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుట్టూ కాష్టం రగులుతుంటే.. భారత్‌కు జరిగే నష్టమెంత?

డాట్స్‌ అన్నీ కలిపి చూస్తే.. ఓ పిక్చర్‌ అయితే కనిపిస్తోంది. అందులో నిజం ఎంతో తెలీదు గానీ.. కామన్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కనిపిస్తోంది. ఆ ఫ్యాక్టర్‌ పేరే చైనా. ప్రస్తుతం నేపాల్‌ అట్టుడికిపోతోంది. చైనాకు దగ్గరవడమే కారణం అనుకోవాలా? ఊరికే అంటున్న మాట కాదిది.. కొన్ని సంఘటనలు చూశాకే ఆ మాట అనాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్‌లోనూ అలాగే జరిగింది. అంతకు ముందు లంకలో రావణకాష్టం వెనక కూడా చైనానే కారణమన్న విశ్లేషణలు చూశాం. ఇక పాకిస్తాన్‌ గురించి చెప్పనక్కర్లేదు. వెనక ఎప్పుడూ చైనా ఉంటూనే ఉంటుంది. సో, భారత్‌ చుట్టూ అస్థిరత సృష్టించడమే లక్ష్యమా? లేక.. అనుకోకుండా అలా జరుగుతున్నాయా..?

చుట్టూ కాష్టం రగులుతుంటే.. భారత్‌కు జరిగే నష్టమెంత?
Neighbourhood Impacts India
Balaraju Goud
|

Updated on: Sep 11, 2025 | 9:48 PM

Share

లేదు కాదు అనుకున్నా.. ఒక విషయం రిలేట్‌ అవుతోంది ఎందుకనో. చంద్రగ్రహణం ఎఫెక్ట్‌ ప్రపంచంపై బాగానే పడిందా? లేకపోతే ఏంటి..! రెండు రోజుల్లో నలుగురు ప్రధానులు దిగిపోవడమా..! ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్‌.. రాజీనామా. థాయ్‌లాండ్ ప్రధాని షిన్‌వత్రా.. రాజీనామా. జపాన్ ప్రధాని ఇషిబా.. రాజీనామా. ఇక నేపాల్‌ ప్రధాని ఓలి.. రాజీనామా. ఇట్స్‌ నాట్ జస్ట్‌ కో-ఇన్సిడెన్స్..? ఆ విషయం పక్కనపెడితే.. నేపాల్‌ తగలబడడాన్ని కచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాలి భారత్. పొరుగింటికి అంటుకున్న నిప్పు.. మనల్ని కాల్చకపోయినా ఆ సెగ అయితే తగులుతుందిగా.. పైగా చుట్టూ మంటలు.. మధ్యలో మనం. నాడు శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్.. నిత్యం రావణకాష్టంలా పాకిస్తాన్. ఇలా చుట్టూ ఉన్న దేశాల్లో అశాంతి రేగితే.. భారతదేశానికి ప్రాబ్లమ్‌ రాదా..? కచ్చితంగా వస్తుంది. ఇంతకీ ఎలా వస్తుంది? ఆ దేశాలు తగలబడితే భారత్‌కు జరిగే నష్టమేంటి? కంప్లీట్‌ డిటైల్స్‌ గా తెలుసుకుందాం. డాట్స్‌ అన్నీ కలిపి చూస్తే.. ఓ పిక్చర్‌ అయితే కనిపిస్తోంది. అందులో నిజం ఎంతో తెలీదు గానీ.. కామన్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కనిపిస్తోంది. ఆ ఫ్యాక్టర్‌ పేరే చైనా. ప్రస్తుతం నేపాల్‌ అట్టుడికిపోతోంది. చైనాకు దగ్గరవడమే కారణం అనుకోవాలా..? ఊరికే అంటున్న మాట కాదిది.. కొన్ని సంఘటనలు చూశాకే ఆ మాట అనాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్‌లోనూ అలాగే జరిగింది. అంతకు ముందు లంకలో రావణకాష్టం వెనక కూడా చైనానే కారణమన్న విశ్లేషణలు చూశాం....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి