Viral Video: అరె ఎవర్రా మీరంతా..! బీచ్‌లో కారు కడగాలని ప్లాన్ చేస్తే.. చివరికి ఇలా..!
కారును కడుగుదామనుకుంటే.. సముద్రం కారును లాగేసుకుంది. గోవా బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ నుంచి గోవా వెళ్లిన పర్యాటకులు, ప్రయాణంలో దుమ్ము పట్టి మురికిగా మారిన కారును కడగాలి అనుకున్నారు. బీచ్‌లో నేరుగా నీటి అలల దగ్గరకు తమ SUV ని తీసుకెళ్లి కడగడం మొదలుపెట్టారు

కారును కడుగుదామనుకుంటే.. సముద్రం కారును లాగేసుకుంది. గోవా బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ నుంచి గోవా వెళ్లిన పర్యాటకులు, ప్రయాణంలో దుమ్ము పట్టి మురికిగా మారిన కారును కడగాలి అనుకున్నారు. బీచ్‌లో నేరుగా నీటి అలల దగ్గరకు తమ SUV ని తీసుకెళ్లి కడగడం మొదలుపెట్టారు. చూస్తుండగా.. సముద్రపు అలలు ఆ కారును మెల్లగా లోపలకు లాగేసుకున్నాయి. చివరకు JCB ని పిలిపించి, తాళ్లు కట్టి, కొన్ని గంటల పాటు శ్రమించి ఆ కారును బయటకు లాగాల్సి వచ్చింది.
గుజరాత్‌కు చెందిన పర్యాటకులు ఎస్‌యూవీ కారు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. గోవాలోని వాగటార్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటి మధ్యలో నిలిచి ఉన్న కారును బయటకు తీయడానికి జేసీబీ సహాయం తీసుకోవలసి వచ్చింది. సోమవారం (మార్చి 23), తెల్లవారుజామున వాగటార్ బీచ్ వద్ద అరేబియా సముద్రంలో అహ్మదాబాద్‌కు చెందిన ఒక పర్యాటకుని లగ్జరీ ఎస్‌యూవీని విచిత్రమైన రీతిలో అడగడానికి ప్రయత్నించాడు. కారును కడుగుతుండగా, సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్న సమయంలో కారు నీటిలో మునిగిపోయింది.
అహ్మదాబాద్‌కు చెందని అంజునా అనే పర్యాటకుడు వాగేటర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేశాడు. ఒక పార్టీ నుండి తిరిగి వచ్చి, కారు తాళాలను హోటల్ కేర్‌టేకర్‌కు అప్పగించాడు. అతను కారును వృత్తిపరంగా కడగడానికి ఒక సిబ్బందికి డబ్బు చెల్లించి, దుమ్ముపట్టిన కారును క్లీన్ చేయడానికి గాను అతనికి టిప్ ఇచ్చాడని సమాచారం. హోటల్ సిబ్బంది కారును సాధారణ వాషింగ్ సెంటర్‌కు తీసుకెళ్లకుండా, ఉదయం 5:30 నుండి 6:00 గంటల మధ్య నేరుగా వాగటార్ బీచ్ ఇసుకలోకి తీసుకెళ్లారు. చేతిలో కేవలం ఒక బకెట్, ఒక మగ్గుతో, ఆ సిబ్బంది సముద్రపు నీటితో కారును శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. సమీపిస్తున్న పోటు గురించి తెలియకుండా, ఆ సిబ్బంది కారును నీటి వైపుకు మరింత ముందుకు తీసుకెళ్లడంతో పరిస్థితి తీవ్రమైంది. కొద్దిసేపటికే, అది తడి ఇసుకలో కూరుకుపోయింది. పోటు పెరిగేకొద్దీ, నీటి మట్టం పెరిగి, చివరికి కారు డోర్ హ్యాండిల్స్ వరకు చేరింది. ఆ తర్వాత జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు.
వీడియో ఇక్కడ చూడండి..
సమాచారం అదుకున్న గోవా పోలీసులు గుజరాత్ రిజిస్ట్రేషన్ గల కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. గోవా బీచ్‌లలో వాహనాలు నడపవద్దని స్థానిక అధికారులు పర్యాటకులను, సిబ్బందిని హెచ్చరిస్తుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటపడింది. వేసవి కాలంలో చాలా మంది పర్యాటకులు తమ విలాసవంతమైన కార్లలో గోవా బీచ్‌కు తరలివస్తుంటారు.
మరిన్న ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
