Andhra Pradesh Weather Forecast: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారిపోయింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, దక్షిణ కోస్తా, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై వర్ష ప్రభావం ఉంటుంది. వర్షం సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.