Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39ఏళ్ల క్రితం రెండు హత్యలు.. ఫ్యామిలీలో వరుస విషాదాలు.. నిందితుడు ఏం చేశాడంటే..?

ఏదైన తప్పు చేస్తే శిక్ష తప్పకుండా అనుభవిస్తారని అంటారు. కొంతమంది మాత్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని హాయిగా జీవిస్తుంటారు. ఆ తర్వాత ఫ్యామిలిలో ఏదైన విషాదం జరిగినప్పుడు అప్పుడు తప్పు చేయడం వల్లే ఇలా జరిగిందని భయపడుతుంటారు. ఇదే విధంగా కేరళలో ఓ వ్యక్తికి జరగ్గా.. పశ్చాతపంతో గతంలో అతడు చేసిన దారుణాలను బయటపెట్టాడు.

39ఏళ్ల క్రితం రెండు హత్యలు.. ఫ్యామిలీలో వరుస విషాదాలు.. నిందితుడు ఏం చేశాడంటే..?
Kerala Man
Krishna S
|

Updated on: Jul 06, 2025 | 10:58 AM

Share

ఓ వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడు రెండు తప్పులు చేశాడు. తప్పులు అంటే ఏవో చిన్నవి కావు.. ఏకంగా ఇద్దరినీ చంపేశాడు. అయినా పోలీసులకు చిక్కలేదు. అలాగే రోజులు గడిచిపోయాయి. తన కుటుంబంలో వరుసగా ప్రమాదాలు జరగడం మొదలుపెట్టాయి. పెద్ద కొడుకు ఓ ప్రమాదంలో మరణించగా.. చిన్నకొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పాత భయాలు అతన్ని వెంటాడాయి. అప్పుడు చేసిన తప్పులకే ఇప్పుడు తన కుటుంబానికి ఇలా జరుగుతుందని అనుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. ఏది అయితే అది అయ్యిందనుకుని.. పోలీసులకు గతంలో జరిగినదంతా చెప్పి సరెండర్ అయ్యాడు. ఫస్ట్ ఆశ్చర్యపోయిన పోలీసులు తర్వాత కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి పాత ఫైళ్లను తిరగేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది.

మహమ్మద్ అలీ అనే వ్యక్తి కోజికోడ్‌  ప్రాంతంలో తన ఫ్యామిలితో కలిసి జీవిస్తున్నాడు. అయితే 1986లో అతడు యవకుడిగా ఉన్నప్పుడు రెండు హత్యలు చేశాడు. ఇప్పుడు సుమారు 39ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అసలు అప్పుడు ఏం జరిగిందో పోలీసులకు క్లియర్‌గా వివరించాడు. కూడరంజి గ్రామంలో ఓ వ్యక్తి తనను వేధించడాన్ని.. ఆత్మరక్షణ కోసం అతడిని తన్నడంతో కాలువలో పడిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. రెండు రోజుల తర్వాత వచ్చి చూడగా.. వాగులో విగతజీవిగా పడి ఉన్నట్లు తెలిపారు. అయితే పోలీసులు సహజమరణం అనుకుని అప్పట్లో ఈ కేసును క్లోజ్ చేశారు.

ఆ తర్వాత 1989లో వెల్లయిల్ బీచ్‌లో మరో వ్యక్తిని సైతం చంపేసినట్లు మహమ్మద్ అలీ ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఆరా తీస్తున్నారు. అప్పట్లో బీచ్‌లో ఓ మృతదేహం దొరికిన మాట నిజమే కానీ.. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని కూడా క్లోజ్ చేశామని  తెలిపారు. అలీ చెప్పిన రెండు కేసులను ధృవీకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు మొదటి ఘటనకు సంబంధించి ఒక చిన్న క్లూ దొరికింది. ‘‘కూడరంజి మిషన్ ఆస్పత్రి వెనకున్న చిన్న వాగులో ఓ యువకుడి మృతదేహం దొరికింది’’ అనే చిన్న వార్త పేపర్ క్లిప్‌ను పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..