సీఏఏపై సుప్రీంను ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తోన్న కేరళ ప్రభుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఏఏపై న్యాయస్థానంను ఆశ్రయించిన రాష్ట్రాల లిస్ట్‌లో కేరళ ముందు వరుసలో నిలిచింది. సీఏఏ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కుతో పాటు పలు ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని కేరళ ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలో ప్రాథమికంగా పేర్కొనే సెక్యులరిజమ్‌కు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని ఆ పిటిషన్‌లో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం […]

సీఏఏపై సుప్రీంను ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 10:21 AM

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తోన్న కేరళ ప్రభుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఏఏపై న్యాయస్థానంను ఆశ్రయించిన రాష్ట్రాల లిస్ట్‌లో కేరళ ముందు వరుసలో నిలిచింది.

సీఏఏ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కుతో పాటు పలు ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని కేరళ ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలో ప్రాథమికంగా పేర్కొనే సెక్యులరిజమ్‌కు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని ఆ పిటిషన్‌లో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో ఇప్పటివరకు మొత్తం 60పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.