పోలీసుల్లో ‘కలుపుమొక్క’ ..దేవేందర్ సింగ్
జమ్మూకాశ్మీర్లో హిజ్బుల్ కమాండర్ నవీద్ బాబు సహా ఇద్దరు టెర్రరిస్టులను ఢిల్లీకి తరలిస్తున్న డీఎస్పీ దేవేందర్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇతని నిర్వాకానికి సంబంధించి మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. శ్రీనగర్ లోని బాదామీ బాగ్ కంటోన్మెంట్ లో గల తన ఇంట్లో ఇతగాడు నవీద్ సహా ఇర్ఫాన్, రఫీ అనే మరో ఇద్దరు ఉగ్రవాదులకు కూడా ఆశ్రయం కల్పించాడట. ఇటీవలే ఈ ముగ్గురూ దేవేందర్ నివాసంలో ఓ రాత్రంతా బస […]

జమ్మూకాశ్మీర్లో హిజ్బుల్ కమాండర్ నవీద్ బాబు సహా ఇద్దరు టెర్రరిస్టులను ఢిల్లీకి తరలిస్తున్న డీఎస్పీ దేవేందర్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇతని నిర్వాకానికి సంబంధించి మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. శ్రీనగర్ లోని బాదామీ బాగ్ కంటోన్మెంట్ లో గల తన ఇంట్లో ఇతగాడు నవీద్ సహా ఇర్ఫాన్, రఫీ అనే మరో ఇద్దరు ఉగ్రవాదులకు కూడా ఆశ్రయం కల్పించాడట. ఇటీవలే ఈ ముగ్గురూ దేవేందర్ నివాసంలో ఓ రాత్రంతా బస చేశారని తెలిసింది.
ఆరు నెలల క్రితమే రాష్ట్రపతి నుంచి పోలీస్ గ్యాలంట్రీ అవార్డు అందుకున్న ఇతని చరిత్ర అంతా మకిలిమయం అని తెలిసి పోలీసులు షాక్ తింటున్నారు. ఖాకీలకు నవీద్ బాబు పట్టుబడకుండా ఉండేందుకు అతడ్ని దేవేందర్ సింగ్ అనేక చోట్లకు మారుస్తూ ఉండేవాడని కూడా తెలుస్తోంది. గత ఏడాది జమ్ముకు తరలించి తరచూ అతడితో కాంటాక్జ్ లో ఉండేవాడని, ఆయుధాలను అందుకుంటూ ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. దేవేందర్ ఇంటి నుంచి ఒక ఏకే-47 రైఫిల్, మరో రెండు పిస్టల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



