AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షం.. సినిమా చూసేందుకు కారులో బయలుదేరిన వైద్య విద్యార్థులు.. దారి మధ్యలో ఉండంగా..

అందరూ వైద్య విద్యార్థులే.. వారంతా సినిమా చూసేందుకు సరదాగా కారులో బయలుదేరారు.. ఈ క్రమంలోనే.. రాత్రి వేళ ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు.. బస్సు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు.

భారీ వర్షం.. సినిమా చూసేందుకు కారులో బయలుదేరిన వైద్య విద్యార్థులు.. దారి మధ్యలో ఉండంగా..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Dec 03, 2024 | 2:02 PM

Share

కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మెడికల్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. కల్లార్‌కోట్‌లోని చంగనస్సేరిముక్ సమీపంలో అలప్పుజా జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బస్సును ఢీకొట్టిందని.. అక్కడికక్కడే ముగ్గురు చనిపోయనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. కేరళలోని అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలప్పుజ గవర్నమెంట్ టీడీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గురువాయుర్‌ నుంచి కాయంకుళానికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కేఎస్‌ఆర్టీసీ ( KSRTC) బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోగా.. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

వేగంగా వస్తున్న కారు బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కారు నుజ్జునుజ్జు అయిందని.. చాలా సేపటి తర్వాత క్షతగాత్రులను బయటకు తీసినట్లు తెలిపారు. మృతుల్లో ఆయుష్ షాజీ (19), శ్రీదీప్ వత్సన్ (19), బి. దేవానందన్ (19), మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ (19). మహమ్మద్ ఇబ్రహీం(19) మరొకరు ఉన్నారు. విద్యార్థుల మృతి వార్త తెలుసుకున్న కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

సినిమాకు వెళ్తుండగా..

నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులంతా అలప్పుజలో సినిమా చూడటానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కారు అదుపు తప్పి వాయిటిల నుంచి కాయంకుళం వెళ్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రమాద ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..