ఆర్టికల్ 370 రద్దుపై ఇవాళ సుప్రీంలో విచారణ
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఆంక్షలు కొనసాగింపు వంటి అంశాలతో సహా సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. జమ్ము కశ్మీర్ విషయంలో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సవాల్ చేస్తూ జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్ లోన్ పిటిషన్ దాఖలు […]
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఆంక్షలు కొనసాగింపు వంటి అంశాలతో సహా సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. జమ్ము కశ్మీర్ విషయంలో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సవాల్ చేస్తూ జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్ లోన్ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా రద్దు తర్వాత కశ్మీర్‌లో చిన్నారులను అక్రమంగా నిర్భంధించాని, బాలల హక్కుల కార్యకర్త ఇనాక్షి గంగూలీ, ప్రొఫెసర్ శాంతాసిన్హా కూడా పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా గృహనిర్భందంపై తమిళనాడుకు చెందిన ఎంపీ, ఎండీఎంకే అధినేత వైగో , తమ కుటుంబ సభ్యులను కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెలియజేస్తూ కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ మరో పిటిషన్ వేశారు. అదే విధంగా కశ్మీర్ లోయలో మీడియాపై ఉన్న ఆంక్షల్ని సవాలు చేస్తూ కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధా భాసిన్ పిటిషన్ వేశారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని పలు రంగాలకు చెందిన వారు ఆర్టికల్ 370 రద్దు పరిస్థితులపై దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.